Share News

Haryana Assembly Elections 2024: నేను సీనియర్‌ని, సీఎం పదవి అడుగుతా..

ABN , Publish Date - Sep 15 , 2024 | 04:27 PM

సీఎం పదవికి తాను అన్ని విధాలా అర్హుడనని, ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఏడోసారి ఎన్నికలకు వెళ్తున్నానని హర్యానా బీజేపీ సీనియర్ నేత అనిల్ విజ్ అన్నారు.

Haryana Assembly Elections 2024: నేను సీనియర్‌ని, సీఎం పదవి అడుగుతా..

చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల (Haryana Assembly Election-2024) వేళ బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అనిల్ విజ్ (Anil Vij) ముఖ్యమంత్రి పదవిపై ఆదివారంనాడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి కావాలని అడుగుతానని చెప్పారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రికార్డు అనిల్ విజ్‌కు ఉంది. ప్రస్తుతం ఏడోసారి ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అయితే ఈసారి బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నయబ్ సింగ్ సైని హర్యానా ఎన్నికలకు వెళ్తుండటం, పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే ఆయనే ముఖ్యమంత్రి అవుతారంటూ బీజేపీ ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో అనిల్ విజ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

పార్టీని ఇంతవరకూ ఏదీ కోరలేదు..

''ఈరోజు వరకూ నేను పార్టీ నుంచి ఏదీ కోరుకోలేదు. హర్యానా ప్రజలు నన్ను కలుసుకునేందుకు వచ్చారు. అంబాలాలో కూడా ప్రజలు నా సీనియారిటీని ప్రస్తావించి మీరెందుకు ముఖ్యమంత్రి కాకూడదని అడిగారు. ప్రజల కోరిక, సీనియారిటీ ప్రాతిపదికగా ఈసారి నేను సీఎం పదవి ఇవ్వాలని అడుగుతాను'' అని 71 ఏళ్ల అనిల్ విజ్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. తనను ముఖ్యమంత్రిని చేస్తారా లేదా అనేది పార్టీ నిర్ణయానికే వదిలిపెడతానని, తనను సీఎం చేస్తే మాత్రం హర్యానా ముఖచిత్రంలో మార్పులు తీసుకువస్తానని చెప్పారు.

Prashant Kishor: మాకే అధికారమిస్తే మద్యంపై నిషేధం గంటలో ఎత్తేస్తా


అలాంటి రూలేమీ లేదు..

ముఖ్యమంత్రి అభ్యర్థిగా సైనిని పార్టీ ప్రకటించింది కదా అని అడిగిన ప్రశ్నకు అనిల్ విజ్ సూటిగా సమాధానమిస్తూ, ముఖ్యమంత్రి పదవి కోసం క్లెయిమ్ చేసుకోరాదనే రూలేమీ లేదని, తాను అడిగేది అడుగుతానని, పార్టీ నిర్ణయానికే ఆ విషయాన్ని వదలిపెడతానని చెప్పారు. మరో వారం రోజుల్లో పోలింగ్ జరుగనున్న సమయంలో ఇలాంటి క్లెయిమ్ చేసుకోవడంపై బదులిస్తూ, తనను కలుసుకునేందుకు వచ్చిన ప్రజల ఆకాంక్షను దృష్టిలో ఉంచుకునే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని అనిల్ విజ్ అన్నారు. గత మార్చిలో మనోహర్ లాల్ ఖట్టార్‌ను సీఎం పదవి నుంచి తప్పించి ఆయన స్థానంలో ముఖ్యమంత్రిగా సైనికి బీజేపీ అధిష్ఠానం పగ్గాలు అప్పగించింది.


For MoreNational NewsandTelugu News

Updated Date - Sep 15 , 2024 | 04:27 PM