Siddaramaiah: కర్ణాటక సీఎమ్ సిద్ధరామయ్య భార్యపై కేసు.. ముడా స్కామ్‌లో ఆమెకు సంబంధముందంటూ ఫిర్యాదు!
ABN , Publish Date - Jul 10 , 2024 | 11:27 AM
మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణం కర్ణాటకలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కర్ణాటక ముఖ్యమంత్రి కన్నుసన్నల్లోనే ఈ స్కామ్ జరిగిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య పార్వతి ఈ స్కామ్ ద్వారా భారీ లబ్ధి పొందారని ఆరోపిస్తూ ఓ సామాజిక కార్యకర్త తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MUDA) కుంభకోణం కర్ణాటక (Karnataka)లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కర్ణాటక ముఖ్యమంత్రి కన్నుసన్నల్లోనే ఈ స్కామ్ జరిగిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) భార్య పార్వతి ఈ స్కామ్ ద్వారా భారీ లబ్ధి పొందారని ఆరోపిస్తూ ఓ సామాజిక కార్యకర్త తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైసూరులోని విజయనగర్ పోలీస్ స్టేషన్‌లో సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ కంప్లైంట్ ఇచ్చారు (Charge Against Siddaramaiah's Wife).
సిద్ధరామయ్య భార్య, ముడా అధికారులు, ఇతర పరిపాలనా అధికారులు ముడా భూకేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారని, వారిపై చర్యలు తీసుకోవాలని స్నేహమయి ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ముడా అవకతవకలపై ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతోందని చెబుతూ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు. లేఅవుట్ అభివృద్ధి కోసం ముడా పరిధిలో భూమిని సేకరించారు. ఆ సేకరణలో భాగంగా భూమి కోల్పోయిన వారకి పరిహారంగా మైసూరులో ప్రైమ్ ఏరియాలో భూమిని కేటాయించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి భార్యతో సహా పలువురు ప్రభావవంతమైన వ్యక్తులు తక్కువ భూమిని ఇచ్చి చాలా ఎక్కువ భూమిని పరిహారంగా పొందరాని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
సేకరించిన భూమి కంటే పరిహారంగా అందించిన భూమి విలువ చాలా ఎక్కువని, దీనివల్ల రాష్ట్ర ఖజానాకు రూ. 4,000 కోట్ల నష్టం వాటిల్లిందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. కాగా, బీజేపీ ఆరోపణలపై సిద్ధరామయ్య స్పందించారు. ``బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే మా భూమిని లాక్కున్నారు. ఆ తర్వాత పరిహారంగా సైట్లు ఇచ్చింది వాళ్లే. వారే ఇప్పుడు అది అక్రమం అంటుంటే ఎలా? అయినా దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామ``ని సిద్ధరామయ్య అన్నారు.
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..