BJP: ‘దీదీ’ పార్టీలో గందరగోళం..? అందుకే ప్రధాని మోదీతో స్టేజీ షేర్, బీజేపీ విమర్శలు
ABN , Publish Date - Mar 02 , 2024 | 11:54 AM
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీపై (దీదీ) భారతీయ జనతా పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. సమయానికి అనుకూలంగా నడుచుకోవడంతో దీదీ నంబర్ వన్ అని మండిపడింది.
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీపై (దీదీ) (Mamata Banerjee) భారతీయ జనతా పార్టీ (BJP) తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. సమయానికి అనుకూలంగా నడుచుకోవడంతో దీదీ నంబర్ వన్ అని మండిపడింది. ‘అవసరానికి అనుగుణంగా మమతా బెనర్జీ (Mamata Banerjee) వ్యవహరిస్తారు. గతంలో పశ్చిమ బెంగాల్‌కు ప్రధాని మోదీ వచ్చిన సమయంలో లెక్క చేయలేదు. ఈ రోజు మాత్రం ప్రధాని మోదీతో భేటీ అయ్యేందుకు అవుతున్నారు. టీఎంసీ పార్టీకి చెందిన నేత షేక్ షాజహాన్ చుట్టూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఉచ్చు బిగుస్తోంది. షాజహాన్ అరెస్ట్ అయిన తర్వాత పార్టీలో గందరగోళం నెలకొంది. పార్టీని, షాజహాన్‌ను రక్షించుకోవాల్సిన అవసరం మమతా బెనర్జీపై ఉంది. పార్టీని కాపాడుకోని, నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అందుకోసమే ప్రధాని మోదీతో మమతా బెనర్జీ సమావేశం అవుతున్నారు అని’ బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
మమతా బెనర్జీ (Mamata Banerjee) ఇండియా కూటమిలో ఉండలేరు. కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవలేరు. అందుకోసమే ప్రధాని మోదీతో మమతా బెనర్జీ సమావేశం అవుతున్నారని దిలీప్ ఘోష్ ధ్వజమెత్తారు. గతంలో పశ్చిమ బెంగాల్‌కు ప్రధాని మోదీ వచ్చిన సమయంలో లెక్క చేయలేదని వివరించారు. పశ్చిమ బెంగాల్‌లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు.. రూ.15 వేల కోట్ల మేర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.