Share News

Sikkim BJP: సిక్కిం నుంచి బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా డోర్జీ త్రేసింగ్ లేప్చా

ABN , Publish Date - Jan 07 , 2024 | 04:15 PM

సిక్కిం నుంచి రాజ్యసభ అభ్యర్థి పేరును బీజేపీ ఖరారు చేసింది. డోర్జీ త్రేసింగ్ లేప్చాను పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. న్యూఢిల్లీ నుంచి 3, సిక్కిం నుంచి ఒక రాజ్యసభ స్థానానికి జనవరి 19న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది.

Sikkim BJP: సిక్కిం నుంచి బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా డోర్జీ త్రేసింగ్ లేప్చా

న్యూఢిల్లీ: సిక్కిం (Sikkim) నుంచి రాజ్యసభ అభ్యర్థి పేరును బీజేపీ (BJP) ఖరారు చేసింది. డోర్జీ త్రేసింగ్ లేప్చా (Dorjee Tshering Lepcha)ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. న్యూఢిల్లీ నుంచి 3, సిక్కిం నుంచి ఒక రాజ్యసభ స్థానానికి జనవరి 19న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది.


ఎవరీ డోర్జీ త్రేసింగ్ లేప్చా..?

సిక్కింలో కీలక రాజకీయ నేతగా లేప్చాకు మంచి పేరుంది. సిక్కిం లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఆయన 2014, 2019లో ఎన్నికయ్యారు. తొలుత సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్ ‌సభ్యుడిగా ఉన్న ఆయన ఆ తర్వాత బీజేపీలో చేరారు. సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్‌లో ఉన్నప్పుడు పవన్ చామ్లింగ్ మంత్రివర్గంలో సిక్కిం ప్రజాపనులు, రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. అనంతర క్రమంలో లేప్చాతో పాటు సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో లేప్చాను బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ఆ పార్టీ ఎంపిక చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం సిక్కిం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్య వహిస్తున్న ఇంద్ర హాంగ్ సుబ్బ పదవీకాలం ఈ ఏడాది మేలో ముగియనుంది. ఈ క్రమంలో లేప్చాను తమ అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా ఈశాన్య ప్రాంతంలో బీజేపీ తమ పట్టును మరింత మెరుగుపరుచుకునే అవకాశం ఉంది.

Updated Date - Jan 07 , 2024 | 04:15 PM