Share News

Stalin : ప్రతీకారం తీర్చుకునేలా పాలన వద్దు

ABN , Publish Date - Jul 25 , 2024 | 06:11 AM

‘ప్రతీకారం తీర్చుకునేలా పరిపాలన వద్దు. రాజకీయంగా మీ ఇష్టాయిష్టాల ప్రకారం ప్రభుత్వాన్ని నడిపితే మీరు ఒంటరి అవుతారు’ అంటూ తమిళనాడు సీఎం స్టాలిన్‌ ప్రధాని మోదీకి హితవు పలికారు. ఈ మేరకు ఆయన బుధవారం సామాజిక మాధ్యమాల్లో

Stalin : ప్రతీకారం తీర్చుకునేలా పాలన వద్దు

చెన్నై, జూలై 24 (ఆంధ్రజ్యోతి): ‘ప్రతీకారం తీర్చుకునేలా పరిపాలన వద్దు. రాజకీయంగా మీ ఇష్టాయిష్టాల ప్రకారం ప్రభుత్వాన్ని నడిపితే మీరు ఒంటరి అవుతారు’ అంటూ తమిళనాడు సీఎం స్టాలిన్‌ ప్రధాని మోదీకి హితవు పలికారు. ఈ మేరకు ఆయన బుధవారం సామాజిక మాధ్యమాల్లో ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ఆర్ధిక నివేదికలో కొన్ని రాష్ట్రాలు మినహా పలు రాష్ట్రాలు నిర్లక్ష్యానికి గురయ్యాయంటూ ‘ఇండియా’ కూటమి ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ‘‘ఎన్నికలు ముగిశాయి, ఇప్పుడు దేశం గురించి ఆలోచించాలంని స్వయంగా మీరే అన్నారు. కానీ, నిన్నటి బడ్జెట్‌ మీ పాలనను కాపాడుతుందే కానీ, దేశాన్ని కాదు’’ అని స్టాలిన్‌ పేర్కొన్నారు.

Updated Date - Jul 25 , 2024 | 06:11 AM