Loksabha Elections: వాట్సాప్‌లో వికసిత్ భారత్ మెసేజ్‌లు ఆపండి, కేంద్రానికి ఈసీ ఆదేశం
ABN, Publish Date - Mar 21 , 2024 | 02:42 PM
మొబైల్ యూజర్లకు వికసిత్ భారత్ పేరుతో వాట్సాప్‌లో మెసేజ్‌లు వస్తున్నాయి. అది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం అని, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు వచ్చాయి. దాంతో ఈసీ చర్యలకు ఉప క్రమించింది. వాట్సాప్‌లో వికసిత్ భారత్ పేరుతో మెసేజ్‌లను తక్షణమే ఆపాలని స్పష్టం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీచేసింది.
ఢిల్లీ: మొబైల్ యూజర్లకు ఇప్పటికీ వికసిత్ భారత్ (Viksit Bharat) పేరుతో వాట్సాప్‌లో (Viksit Bharat) మెసేజ్‌లు వస్తున్నాయి. అది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం అని, కేంద్ర ఎన్నికల సంఘానికి పలు ఫిర్యాదులు వచ్చాయి. దాంతో ఈసీ (EC) చర్యలకు ఉప క్రమించింది. వాట్సాప్‌లో (WhatsApp) వికసిత్ భారత్ పేరుతో మెసేజ్‌లను తక్షణమే ఆపాలని స్పష్టం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీచేసింది.
లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఆ రోజు నుంచి కూడా వికసిత్ భారత్ మెసేజ్‌లు వస్తున్నాయని గుర్తించారు. కోడ్ రాకముందే మెసేజ్ పంపించామని, సాంకేతిక కారణం వల్ల కొన్ని మెసేజ్‌లు ఆలస్యంగా చేరాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వెంటనే వికసిత్ భారత్ పేరుతో మెసేజ్‌లను ఆపాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
వినియోగదారులకు వికసిత్ భారత్ పేరుతో మెసేజ్, వికసిత్ భారత్ ద్వారా ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాల సమాచారం ఇస్తున్నారు. ఆ సమాచారంపై కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేశాయి. కేంద్ర ప్రభుత్వం పంపించే వికసిత్ భారత్ సమాచారం ఎన్నికల కోడ్ ఉల్లంఘించడమే అవుతోందని అభిప్రాయ పడ్డాయి. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా, చర్యలు తీసుకుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇది కూడా చదవండి.
Delhi: కేజ్రీవాల్ ఈడీ విచారణకు వెళ్తారు.. కాని.. ఆప్ మంత్రి సంచలన ప్రకటన..!
Updated Date - Mar 21 , 2024 | 03:34 PM