Deep Fake: ఎన్నికల వేళ.. డీప్ ఫేక్ ఆందోళనలు.. అరికట్టలేమా?
ABN , Publish Date - Mar 10 , 2024 | 09:39 PM
డీప్ ఫేక్(Deep Fake) టెక్నాలజీతో ఎదురయ్యే పరిణామాలపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది 50కి పైగా దేశాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. రాజకీయ నాయకులు తమ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ఫేక్ వీడియోలు సృష్టించే అవకాశమూ లేకపోలేదు. ఆ మధ్య హీరోయిన్ రష్మికా మందన్న డీప్ ఫేక్ బారిన పడింది.
ఢిల్లీ: డీప్ ఫేక్(Deep Fake) టెక్నాలజీతో ఎదురయ్యే పరిణామాలపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది 50కి పైగా దేశాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. రాజకీయ నాయకులు తమ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ఫేక్ వీడియోలు సృష్టించే అవకాశమూ లేకపోలేదు. ఆ మధ్య హీరోయిన్ రష్మికా మందన్న డీప్ ఫేక్ బారిన పడింది. ఆ తరువాత పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా ఇబ్బందులు ఎదుర్కున్నారు.
ప్రపంచంలోని చాలా దేశాల్లో ఎన్నికలు జరగబోతుండగా.. బిలయన్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. డీప్ ఫేక్ టెక్నాలజీతో వీడియోలు, వాయిస్ రికార్డులు, ముఖాలను మార్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. రాజకీయ నాయకులు ఇచ్చే ప్రసంగాలను వారిని కించపరిచే విధంగా మార్చే ప్రమాదమూ ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాలు ఈ విషయంపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచిస్తున్నారు.
డీప్ ఫేక్‌తో తప్పుడు సమాచారం సృష్టించడం, ప్రజల అభిప్రాయాలను మార్చే అవకాశం ఉంది. 2017 చివరిలో ఆన్లైన్లో 7,900 వీడియోలతో డీప్‌ఫేక్ కంటెంట్ విస్తరణ పెరిగింది. 2019 ప్రారంభంలో, ఈ సంఖ్య దాదాపు రెండింతలు పెరిగి 14,678కి చేరుకుంది. 2024నాటికి టెక్నాలజీ మరింతగా పెరిగిపోయింది.
ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ప్రస్తుత అధ్యక్షుడు జో బిడెన్‌ల డీప్‌ఫేక్ వీడియోలు అధ్యక్ష ఎన్నికల సమయంలో యూఎస్ పౌరులను గందరగోళపరిచాయి. రష్యాపై పోరాటంలో సైనికులు లొంగిపోవాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ కోరుతున్నట్లు చూపించే డీప్‌ఫేక్ వీడియో సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అయింది. ఇది ఉక్రెయిన్ సైన్యంలో భయాందోళనలు, గందరగోళాన్ని సృష్టించింది.
భారత ప్రభుత్వం ఎక్స్, మెటా (Meta) వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు పలు ఆదేశాలు జారీ చేసింది. AI రూపొందించిన డీప్‌ఫేక్ కంటెంట్ విస్తరణను నియంత్రించాలని కోరింది. అయితే డీప్‌ఫేక్ దాడులకు వ్యతిరేకంగా సంస్థలు తమను తాము రక్షించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి