Share News

PM Modi: అధికారులతో ప్రధాని మోదీ కీలక సమావేశం.. చర్చించే అంశాలివే

ABN , Publish Date - Jun 02 , 2024 | 12:59 PM

సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న(Lok Sabha Elections 2024) సమయంలో ప్రకృతి విపత్తులు దేశాన్ని వణికించాయి. రెమల్ తుపాన్(Remal Cyclone) ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. రెండు రోజుల క్రితం వరకు ఎన్నికల ప్రచారంలో బిజీగా గడిపిన ప్రధాని మోదీ(PM Modi) రెమాల్ ప్రభావంపై అధికారులతో చర్చించనున్నారు.

PM Modi: అధికారులతో ప్రధాని మోదీ కీలక సమావేశం.. చర్చించే అంశాలివే

ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న(Lok Sabha Elections 2024) సమయంలో ప్రకృతి విపత్తులు దేశాన్ని వణికించాయి. రెమల్ తుపాన్(Remal Cyclone) ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. రెండు రోజుల క్రితం వరకు ఎన్నికల ప్రచారంలో బిజీగా గడిపిన ప్రధాని మోదీ(PM Modi) రెమాల్ ప్రభావంపై అధికారులతో చర్చించనున్నారు.

ఇందులో భాగంగా ప్రభుత్వ అధికారులతో ఆదివారం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. తుపాన్‌తోపాటు పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతండటంతో వీటిపై కూడా ప్రధాని సమావేశం నిర్వహిస్తారు. లోక్ సభ ఎన్నికల్లో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమాగా ఉన్న మోదీ జూన్ 4 తర్వాత 100 రోజుల ఎజెండాను ప్రకటించనున్నారు.


ఈ అంశంపై కూడా చర్చలు జరుపుతారు. “ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలలో తుపాను అనంతర పరిస్థితి, దేశ వ్యాప్తంగా వడగాల్పుల పరిస్థితులను సమీక్షించేందుకు సమావేశం నిర్వహిస్తున్నాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పెద్దఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చాక 100 రోజుల ప్రత్యేక ప్రణాళికను అమలు పరుస్తాం”అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే 100 రోజుల కార్యక్రమాన్ని అమలు చేస్తామని మోదీ గతంలోనే చెప్పారు.


ఎగ్జిట్ పోల్స్ అన్ని బీజేపీకే..

మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో 371 నుంచి 401 స్థానాల్లో గెలుపొంది మోదీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) పార్లమెంటులో దాదాపు మూడు వంతుల మెజారిటీని సాధించవచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అంటే గెలుపు నల్లేరు నడకే అయినా.. ఎన్ని సీట్లు సాధిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

For Latest News and National News click here..

Updated Date - Jun 02 , 2024 | 12:59 PM