Share News

Goa: బెంగళూరు సీఈవో కేసు.. తల్లిని మానసిక పరీక్షలకు తరలించిన పోలీసులు

ABN , Publish Date - Jan 11 , 2024 | 12:39 PM

గోవాలో సంచలనం సృష్టించిన కుమారుడి హత్య కేసు నిందితురాలిని మరింతగా విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా సుచనా సేథ్ (Suchana Seth)కు మానసిక పరీక్షలు చేయించాలని నిర్ణయించారు. రెండ్రోజుల క్రితం గోవాలో కన్న కొడుకుని సుచనా కిరాతకంగా హత్య చేసిన విషయం విదితమే.

Goa: బెంగళూరు సీఈవో కేసు.. తల్లిని మానసిక పరీక్షలకు తరలించిన పోలీసులు

ఢిల్లీ: గోవాలో సంచలనం సృష్టించిన కుమారుడి హత్య కేసు నిందితురాలిని మరింతగా విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా సుచనా సేథ్ (Suchana Seth)కు మానసిక పరీక్షలు చేయించాలని నిర్ణయించారు. రెండ్రోజుల క్రితం గోవాలో కన్న కొడుకుని సుచనా కిరాతకంగా హత్య చేసిన విషయం విదితమే. ఆమె స్వయాన ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీకి సీఈవో(CEO) కావడం గమనార్హం.

స్థానికుల సమాచారంతో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం సాధారణ వైద్య పరీక్షలు నిర్వహిస్తామని.. ఇవాళ ఆమెకు మానసిక పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షల ద్వారా నిందితురాలి మానసిక ఆరోగ్యంపై ఓ స్పష్టత వస్తుందని వెల్లడించారు. విచారణ సమయంలో తన కుమారుడు ఎలా చనిపోయాడో తెలియదని సేథ్ చెప్పినట్లు తెలుస్తోంది. బాబు అంత్యక్రియల్ని బుధవారం బెంగళూరులో పూర్తి చేశారు.

గోవా (Goa)కి చెందిన ప్రముఖ కంపెనీ సీఈవో సుచనా సేథ్ పోలీసుల విచారణలో పొంతనలేని సమాధానం చెబుతున్నట్లు సమాచారం. ముందు ప్లాన్ వేసుకునే బాలుడ్ని హత్య చేసినట్లుగా తెలుస్తోంది. బుధవారం ఇందుకు సంబధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. ఘటన జరిగిన రూంలో పోలీసులు కీలక ఆధారాలు కనుగొన్నారు. హత్యకు ముందు చిన్నారికి దగ్గు సిరప్ ఓవర్ డోస్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తరువాత అతన్ని దిండు లేదా దుస్తులతో ఊపిరాడనీకుండా చేసి చంపినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది.


ఆమె అద్దెకు ఉన్న అపార్ట్‌మెంట్ గదిని తనిఖీ చేయగా.. రెండు ఖాళీ దగ్గు మందు సీసాలు కన్పించాయి. అందులో చిన్న సీసాను అక్కడి సిబ్బందే తీసుకొచ్చినట్లు విచారణలో తేలింది. పెద్ద సీసాను సుచనా తనతో పాటు తీసుకొచ్చి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

‘‘పక్కా స్కెచ్‌తోనే ఈ హత్య జరిగినట్లు కన్పిస్తోంది. గదిలో దగ్గు మందు సీసాలతో చిన్నారికి హైడోస్‌ ఇచ్చి ఉంటారని అనిపిస్తోంది. పోస్టుమార్టం నివేదికలో చిన్నారి ఊపిరాడక చనిపోయినట్లు తేలింది’’ అని ఓ పోలీస్ అధికారి తెలిపారు. అయితే తాను ఈ హత్య చేయలేదనే.. ఉదయం లేచి చూసేసరికి బాబు చనిపోయి ఉన్నాడని ఆమె విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. భర్త తనను తరచూ హింసించేవాడని చెప్పింది. అయితే భర్త ఆమె ఆరోపణల్ని ఖండించారు.

"మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి"

Updated Date - Jan 11 , 2024 | 01:04 PM