Tihad Jail Officials : ఎల్జీకి కేజ్రీవాల్ లేఖ అధికార దుర్వినియోగమే
ABN , Publish Date - Aug 13 , 2024 | 04:12 AM
జైలు నుంచి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సెనాకు లేఖ రాయడం అధికార దుర్వినియోగానికి పాల్పడటమేనని తిహాడ్ జైలు అధికారులు సీఎం కేజ్రీవాల్ చర్యల్ని తప్పుబట్టారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 12: జైలు నుంచి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సెనాకు లేఖ రాయడం అధికార దుర్వినియోగానికి పాల్పడటమేనని తిహాడ్ జైలు అధికారులు సీఎం కేజ్రీవాల్ చర్యల్ని తప్పుబట్టారు. అది నిబంధనలను అతిక్రమించడమే అవుతుందని పేర్కొన్నారు.
తాను జైల్లో ఉన్నందున... ఈ నెల 15న జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో తన స్థానంలో మంత్రి అతిశీకి జెండా ఎగురవేసేందుకు అనుమతినివ్వాలని ఎల్జీకి ఇటీవలే సీఎం కేజ్రీవాల్ లేఖ రాశారు.
అయితే జైలు నిబంధనల ప్రకారం... జైల్లో ఉన్న వ్యక్తి వ్యక్తిగత విషయాలను మాత్రమే లేఖలో పేర్కొనాల్సి ఉంటుందని, కానీ ఎల్జీకి లేఖ రాయడం ఢిల్లీ జైలు నిబంధనలకు విరుద్ధమని అందుకే దానిని పంపలేదని అధికారులు కేజ్రీవాల్‌కు రాసిన లేఖలో వెల్లడించారు.