శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి
ABN , Publish Date - Mar 28 , 2025 | 10:53 PM
కేంద్ర విశ్వహిందూ పరిషత్ సూచన మేరకు దేశ వ్యాప్తంగా ఈనెల 30న ఉగాది, హనుమాన్ జయంతి, ఏప్రిల్ 12 వర కు శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వ హించాలని నిర్ణయించినట్లు జిల్లా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ రాం బాబు, కన్న శివకుమార్, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు మురళిభట్టడ్, కడదాస్, ప్రవీణ్‌లు శుక్ర వారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.

నారాయణపేటటౌన్/మక్తల్, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): కేంద్ర విశ్వహిందూ పరిషత్ సూచన మేరకు దేశ వ్యాప్తంగా ఈనెల 30న ఉగాది, హనుమాన్ జయంతి, ఏప్రిల్ 12 వర కు శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వ హించాలని నిర్ణయించినట్లు జిల్లా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ రాం బాబు, కన్న శివకుమార్, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు మురళిభట్టడ్, కడదాస్, ప్రవీణ్‌లు శుక్ర వారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. జి ల్లా వ్యాప్తంగా వాడవాడలా శ్రీరామ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే హనుమాన్ చాలీసా పారాయణంలో భాగంగా ఈనెల 29న పల్లా హరిజన్‌వాడలోని ఆంజనేయస్వామి దేవాలయంలో సాయంత్రం 7 గంటల కు సామూహిక హనుమాన్ చాలీసా పారాయ ణం ఉంటుందని, హిందువులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
అదేవిధంగా, మక్తల్ పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం శ్రీరా మనవమి ఉత్సవాల వాల్‌పోస్టర్‌ను బజరంగదళ్, వీహెచ్‌పీ నాయకులు విడుదల చేశారు. ఏప్రిల్ 6 శ్రీరామనవమి ఉత్సవాలు, 12న హ నుమాన్ జయంతి వేడుకలను నియోజకవర్గంలోని గ్రామగ్రామాన నిర్వహించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే, ఉగాది రోజున పతీ ఇంటిపై కాషాయ జెండా ఎగురవేయాలన్నారు. వీహెచ్‌పీ, బజరంగదళ్ నాయకులు భాస్కర్‌రెడ్డి, భీమేష్, సత్యనారాయణగౌడ్, హన్మంతు, ఆశప్ప, రాహుల్, మూర్తి, నాగరాజు, లింగప్ప, శ్రీను, అంజి, శ్రీకాంత్‌గౌడ్ ఉన్నారు.
అలాగే, మక్తల్ పట్టణంలోని సత్యసాయి మందిరంలో ఈనెల 30న రాష్ర్టీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవం నిర్వహించనున్నామని మక్తల్ మండల కార్యవాహ తిరుపతి శ్రీనివాసులు తెలిపారు.