Share News

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇళ్లను నిర్మించుకోవాలి

ABN , Publish Date - Mar 28 , 2025 | 10:49 PM

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇం దిరమ్మ ఇళ్లను నిర్మించుకోవాలని, లబ్ధిదారులు సకాలంలో నిర్మాణం చేపట్టి అధికారులకు సహకరించాలని అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌ అన్నారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇళ్లను నిర్మించుకోవాలి
చంద్రవంచ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌

- నారాయణపేట అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌

కోస్గి, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇం దిరమ్మ ఇళ్లను నిర్మించుకోవాలని, లబ్ధిదారులు సకాలంలో నిర్మాణం చేపట్టి అధికారులకు సహకరించాలని అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌ అన్నారు. శుక్రవారం కోస్గి మండలంలోని చంద్రవంచ గ్రా మంలో నిర్మిస్తున్న 193 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఆయన పరిశీ లించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విడుతల వారీగా లబ్ధిదారులకు నిధులు మంజూరు చేస్తామన్నారు. అదేవిధంగా గ్రామంలో ప్రధాన సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కోస్గి తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న ఆదర్శ ఇందిర మ్మ ఇంటి నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు. మునిసిపల్‌ కార్యాలయాన్ని తనిఖీ చేసి పట్టణంలో రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయే వారి వివరాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్రీనివాసులు, కమిషనర్‌ నాగరాజు, పంచాయతీ కార్యదర్శి సునీత, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు రఘువర్దన్‌రెడ్డి, గ్రామస్థు లు ఉన్నారు.

Updated Date - Mar 28 , 2025 | 10:49 PM