సంపులో పడి మహిళ మృతి
ABN , Publish Date - Mar 28 , 2025 | 10:45 PM
జడ్చర్ల మునిసిపాలిటీలోని రంగారావుతోటలో గల ఓ ఇంటి ఆవరణలో సంపులో పడి ఒక మహిళ మృతి చెందింది. జడ్చర్ల ఎస్‌ఐ మల్లేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. జడ్చర్లకు చెందిన చాకలి బాలమణి కూతురు పూజ(34)కు వివాహమైంది. భర్తతో విడిపోయి, జడ్చర్లలోని రంగారావుతోటలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటోంది.

అనుమానాస్పద మృతిగా
కేసు నమోదు
జడ్చర్ల, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): జడ్చర్ల మునిసిపాలిటీలోని రంగారావుతోటలో గల ఓ ఇంటి ఆవరణలో సంపులో పడి ఒక మహిళ మృతి చెందింది. జడ్చర్ల ఎస్‌ఐ మల్లేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. జడ్చర్లకు చెందిన చాకలి బాలమణి కూతురు పూజ(34)కు వివాహమైంది. భర్తతో విడిపోయి, జడ్చర్లలోని రంగారావుతోటలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటోంది. పూజ తల్లి చాకలి బాలమణి జడ్చర్ల పట్టణంలోని నిమ్మబావిగడ్డ వద్ద గల డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రాంగణంలో నివసిస్తోంది. తల్లి పూజకు గురువారం సాయంత్రం ఫోన్ చేస్తే ఎత్త లేదు. శుక్రవారం ఉదయం సైతం ఫోన్ ఎత్తకపో వడంతో పూజ నివాసం ఉంటున్న ఇంటికి వచ్చింది. ఇల్లు తెరుచుకుని ఉండగా, పూజ కనిపించ లేదు. పరిసర ప్రాంతంలో ఆరా తీసినా సమాచారం లభించ లేదు. కొంతసేపటి తరువాత ఇంటి ఆవరణలోని సంపులోంచి నీళ్లు తీసుకునేందుకు చూడగా, అందులో పూజ అచేతనంగా పడి ఉండడాన్ని గుర్తించింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. జడ్చర్ల ఫైర్ స్టేషన్ లీడింగ్ ఫైర్‌మెన్ లక్ష్మీకాంత్‌రెడ్డి, డ్రైవర్, ఆపరేటర్ సురేశ్, ఫైర్‌మెన్ రాజేష్, పవన్‌కుమార్, శ్రీశైలంగౌడ్ చేరుకుని మృత దేహాన్ని సంపులోంచి బయటికి తీశారు. ఎస్‌ఐ మల్లేష్ ప్రాథమిక విచారణ చేపట్టారు. అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని జడ్చర్ల ఆస్పత్రికి తరలించారు. తల్లి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమో దు చేశారు.