Health Tips : పెద్దగా శ్రమలేకుండా బరువు తగ్గాలంటే ఈ జ్యూస్‌లు తాగితే చాలు...!
ABN , Publish Date - Jul 25 , 2024 | 03:58 PM
సమతుల్య ఆహారాన్ని మితంగా తీసుకోవడం, మంచి జీవనశైలి అలవాట్లతో అధిక బరువును తగ్గించుకోవచ్చు.
త్వరగా బరువు తగ్గాలనుకునే వారికి ఇప్పటి రోజుల్లో అనేక మార్గాలున్నాయి. వ్యాయామం ఎక్కువగా చేయడం, సమతుల్య ఆహారాన్ని మితంగా తీసుకోవడం, మంచి జీవనశైలి అలవాట్లతో అధిక బరువును వదిలించుకోవచ్చు. వివిధ రకాల ఖరీదైన డైట్ ఫ్లాన్స్ కన్నా, తేలికైన విధానాల్లో కూడా బరువు సమస్యను తగ్గించుకోవచ్చు. మనం రోజువారి తీసుకునే ఆహారంలో చిన్న చిన్న మార్పులను చేసుకుంటూ, సరైన వ్యాయామ నియమాలు పాటించడం వల్ల ఊబకాయం సమస్య తీరుతుంది. బరువు తగ్గాలంటే ఎలాంటి పద్ధతుల్ని పాటించాలి.
అధిక బరువు ఇప్పటి రోజుల్లో అందరినీ ఇబ్బంది పెడుతున్న సమస్య. బరువు పెరిగినంత తేలికగా, వదిలించుకోవడం వీలు కాదు. దీనికోసం చాలా మంది వ్యాయామం అనీ, డైటింగ్ అని అనేక పద్దతుల్ని పాటిస్తూ ఉంటారు. బరువు తగ్గడానికి, శరీరంలో కొవ్వును తగ్గించుకోవడానికి రోజువారి తీసుకునే ఆహారం మీద శ్రద్ధ వహించడం చాలా అవసరం. ఆహారం విషయంలో ఎంత శ్రద్ధ పెడితే అంత త్వరగా బరువు తగ్గేందుకు వీలు ఉంటుంది. కొన్నిరకాల జ్యూస్‌లను తీసుకోవడం వల్ల త్వరగా వెయిట్ లాస్ అయ్యేందుకు అవకాశం ఉంది. అవేమిటంటే..
క్యారెట్..
తక్కువ కేలరీలు ఉన్న కూరగాయలు బరువు తగ్గడానికి ఎంచుకోవడం మంచి జీర్ణక్రియకు సహకరిస్తాయి. అందులో ముఖ్యంగా క్యారెట్ జ్యూస్. క్యారెట్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బరువు త్వరగా తగ్గేందుకు సపోర్ట్ చేస్తుంది.
సొరకాయ జ్యూస్..
సొరకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది తీసుకున్న చాలా సమయం వరకూ కడుపు నిండుగా ఉంటుంది. క్యాలరీల విషయానికి వస్తే సొరకాయలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. రోజూ తినే ఆహారంలో సొరకాయను చేర్చడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
Soak Before Eating : ఈ పదార్ధాలను ఎందుకు తినే ముందు నానబెట్టి తినాలి..!
బచ్చలికూర..
బచ్చలి కూరలో కూడా మంచి పోషకాలున్నాయి. బచ్చలికూరను జ్యూస్ రూపంలో తీసుకుంటే ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. ఒత్తడిని దూరం చేస్తుంది. ఉప్పు, నిమ్మరసం కలిపిన బచ్చలికూర జ్యూస్ రోజులో ఒకసారి తీసుకుంటే సరిపోతుంది.
బీట్రూట్..
బీట్రూట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి అందుతుంది. బరువు తగ్గడంతో పాటు ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, ఫైబర్ సమృద్ధిగా ఉండి రక్త వృద్ధిని పెంచుతాయి. బీట్రూట్ రసంలో యాపిల్స్, క్యారెట్ వంటి కూరగాయలను కలిపి కూడా జ్యూస్ చేసుకోవచ్చు.
Health Tips : ఎయిర్ పాడ్స్ వాడితే బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా..!
క్యాబేజీ..
ఉబ్బరం, అజీర్ణం నుంచి ఉపశమనం కలగడానికి క్యాబేజీ చక్కని ఎంపిక. బరువు తగ్గేందుకు, జీర్ణవ్యవస్థను క్లియర్ చేయడంలో సహకరిస్తుంది. వ్యర్థాలను తొలగించడంలోనూ, కడుపును శుభ్రంగా ఉంచడంలోనూ క్యాబేజీ చక్కగా పనిచేస్తుంది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.