Sleeping Risk : నిద్ర సరిగా లేకపోతే గుండె సమస్యలు తప్పవా..!
ABN , Publish Date - Jul 12 , 2024 | 04:15 PM
ప్రతి ఒక్కరికీ 7 గంటల నిద్ర ఉండాలి. అయితే ఇప్పటి పిల్లలు, పెద్దల్లో కనీసం కావాల్సిన నిద్ర కూడా నిద్రపోవడంలేదు. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. ఇలా నిద్రపోని వారిలో గుండె సమస్యలు వచ్చే అవకాశం దాదాపు 20 శాతం వరకూ ఉంటుంది.
రాత్రి నిద్ర ప్రతి ఒక్కరికీ అవసరం. నిద్ర సరిగా రాకపోతే ఉదయం ఏ పనిని సరిగా చేయలేం. నిరుత్సాహంగా ఉంటుంది. ఏ పని చేయాలన్నా ఆశక్తి ఉండదు. ప్రతి దానికి వాయిదాలు వేస్తూ నీరసంగా కనిపిస్తాం. చేసే పనుల్లోనూ, ప్రవర్తనలోనూ రాత్రి సరిగా పట్టని నిద్ర తాలూకూ నీరసం రోజంతా వెంటాడుతుంది. అందుకే ఏ కారణంగానైనా సరిగా నిద్రలేకపోతే మాత్రం మరో రోజుకు ఆ సమస్య రాకుండా చూసుకోవాలి. నిద్ర లేమి కారణంగా అనేక అనారోగ్యాలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. ఇంకా దీనితో ఎన్ని సమస్యలంటే..
ప్రతి ఒక్కరికీ 7 గంటల నిద్ర ఉండాలి. అయితే ఇప్పటి పిల్లలు, పెద్దల్లో కనీసం కావాల్సిన నిద్ర కూడా నిద్రపోవడంలేదు. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. ఇలా నిద్రపోని వారిలో గుండె సమస్యలు వచ్చే అవకాశం దాదాపు 20 శాతం వరకూ ఉంటుంది. స్ట్రోక్ వచ్చే ప్రమాదం 82 శాతం వరకూ ఉంటుంది.
నిద్రపోవడానికి సరైన సమయం రాత్రి 10 నుంచి 11 గంటలు.. ఈ మధ్యలో రాత్రి నిద్ర నిద్రపోవాలి. ఇలా చేస్తే హార్మోన్లు విడుదలవుతాయి. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం లేదా నిద్రలేమి సమస్య కారణంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. పేలవమైన నిద్ర అలవాట్ల కారణంగా పగటిపూట చురుగుదనం తగ్గి అనారోగ్యాల పాలవుతారు.
దీనికి తోడు..
ధూమపానం., ఆల్కహాల్, మాదకద్రవ్యాల వినియోగం, మత్తు పదార్థాలు కూడా నిద్రలేమిని పెంచుతాయి. అలాగే గుండె జబ్బుల ప్రమాదం కూడా పొంచి ఉంటుంది.
Women Health : గర్భిణీలకు ఎంత సమయం నిద్ర కావాలి.. సరైన నిద్ర లేకపోతే.. !
నిద్రకు అరగంట ముందు...
నిద్రపోవడానికి గంట, అరగంట ముందు ఎలక్ట్రికల్ వస్తువులను వినియోగించరాదు. నిద్రకు ముందు కెఫీన్ పదార్థలాను తీసుకోరాదు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే చక్కని నిద్ర సొంతం అవుతుంది. నిద్ర సమయాలు బావుంటే మంచి నిద్ర వస్తుంది. అలాగే చాలా వ్యాధులకు చెక్ పెట్టినవారు అవుతారు.
నిద్రలేకపోతే చావు తప్పదా..
సరైన నిద్రలేకపోతే అంటే రోజులో కనీసం 5 గంటలకన్నా తక్కువ సమయం నిద్రపోతే మాత్రం వారికి అకాల మరణం తప్పదంటున్నాయి అధ్యయనాలు.. వేళకు సరైన నిద్ర ఎంత అవసరం అంటే మన ప్రాణాన్ని కాపాడుకునేంత.
Super Food : రాగులతో బరువు తగ్గడం సులువే.. దీనితో ఇంకా బోలెడు లాభాలు..!
నిద్ర సరిగా లేకపోతే హృదయ స్పందన రేటు తగ్గుతుంది. నిద్ర శరీరంలో హార్మోన్లను నియంత్రిస్తుంది. శరీరం కూడా తీవ్రమైన ప్రమాదంలో పడుతుంది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.