Share News

Walking : వ్యాయామం

ABN , Publish Date - Nov 12 , 2024 | 05:27 AM

నడక ఆరోగ్యకరం. అయితే ఆ నడకకు కూడా ఒక క్రమపద్ధతి ఉండాలి. అప్పుడే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. అలాంటి ఒక పద్ధతే 6-6-6. ఈ నడక నియమాలను అనుసరిస్తే అనారోగ్యం దరిచేరదు.

Walking : వ్యాయామం

వ్యాయామం

6-6-6

డక ఆరోగ్యకరం. అయితే ఆ నడకకు కూడా ఒక క్రమపద్ధతి ఉండాలి. అప్పుడే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. అలాంటి ఒక పద్ధతే 6-6-6. ఈ నడక నియమాలను అనుసరిస్తే అనారోగ్యం దరిచేరదు.

6 నిమిషాల పాటు శరీరాన్ని వ్యాయామానికి సిద్ధం చేయడం (వార్మప్‌).. 6 నిమిషాలను చల్లబరచటం.. ఉదయం ఆరు గంటలకు లేదా సాయంత్రం ఆరు గంటలకు 60 నిమిషాల పాటు నడవడమే 6-6-6 నడక నియమం. అంటే రోజుకు 60 నిమిషాలు నడవాలి. ఒకే సారి 60 నిమిషాలు నడవలేకపోతే- ఉదయం 30 నిమిషాలు, సాయంత్రం 30 నిమిషాలు కూడా నడవవచ్చు. ఈ సమయాలు ఉద్యోగులకు సైతం అనువుగా ఉండడం, పొందే ఫలితం మెరుగ్గా ఉండడంతో ఈ కొత్త నడక నియమం ఈ మధ్య కాలంలో సర్వత్రా ఆదరణ పొందుతోంది. ఈ నియమంతో ఎలాంటి ఫలితాలు దక్కుతాయంటే...

  • ఉదయం నడక

ఉదయం ఆరు గంటలకు నడవడం వల్ల, శరీరంలో కొవ్వు కరిగే వేగం పెరుగుతుంది. ఉదయం శరీరం హుషారుగా ఉంటుంది. కాబట్టి చలాకీగా నడవగలుగుతాం. తాజా గాలి పీలుస్తూ, చకచకా నడవగలుగుతాం! దాంతో రక్తప్రసరణ మెరుగవుతుంది. మనసు ఉల్లాసంగా ఉంటుంది. ఏడు గంటలకు నడక పూర్తయిపోతుంది. కాబట్టి రోజులో చాలా సమయం మిగిలి ఉంటుంది.

  • సాయంకాలం నడక

రోజు మొత్తంలో శరీరంలో పోగయ్యే ఒత్తిడికి సాయంకాలపు నడక విరుగుడుగా పని చేస్తుంది. నడకతో శరీరం అలసి, రాత్రికి కమ్మని నిద్ర పడుతుంది. రోజంతా కుర్చీలో కూర్చుని ఉద్యోగాలు చేసే వాళ్లు సాయంకాలం గంట పాటు నడవడం వల్ల శరీరంలో చురుకుదనం పెరుగుతుంది. కండరాల నొప్పులు అదుపులోకొస్తాయి.


  • వారానికి ఐదుసార్లు

గుండె, ఊపిరితిత్తులు బలపడతాయి. శ్వాసకోస సమస్యలు, హృద్రోగాల ముప్పులు దరి చేరకుండా ఉంటాయి. జీర్ణక్రియ మెరుగు పడుతుంది. మానసికోల్లాసం దక్కుతుంది. శరీరం చురుగ్గా మారి, పనులన్నీ సులభంగా చేసుకోగలుగుతాం! అలాగే అదనపు క్యాలరీలు ఖర్చయి, శరీర బరువు అదుపులో ఉంటుంది.

  • జాగ్రత్తలు

ఒక రోజులో ఎంత సేపు నడవాలనే విషయంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వయస్సు ఆధారంగా.. ఆరోగ్య పరిస్థితి ఆధారంగా.. వైద్యుల ఇచ్చే సలహా ఆధారం ఎంత సేపు నడవాలనే విషయాన్ని నిర్ణయించుకోవాలి.

Updated Date - Nov 12 , 2024 | 05:27 AM