Navya : దురాశ ఫలితం
ABN , Publish Date - May 31 , 2024 | 12:08 AM
ఒక నగరంలో రంగా మరియు కమల అనే భార్యా భర్తలు ఉండేవారు. రంగా అడవికి వెళ్లి, కట్టెలు కొట్టి తెచ్చి అమ్ముకుని జీవనం సాగించేవాడు.
ఒక నగరంలో రంగా మరియు కమల అనే భార్యా భర్తలు ఉండేవారు. రంగా అడవికి వెళ్లి, కట్టెలు కొట్టి తెచ్చి అమ్ముకుని జీవనం సాగించేవాడు. ఒకరోజు రంగాకు అడవిలో కాలికి గాయం ఐన ఒక ముని కనిపించాడు. రంగా ముని గాయానికి కట్టు కట్టి సేవ చేసాడు అపుడు ముని సమయానికి సాయం చేసి నాకెంతో మేలు చేసావు. నీకేం కావాలో అడుగు అన్నాడు. రంగా ఆగండి స్వామీ ఇంటికి వెళ్లి నాభార్యను అడిగి వస్తాను అని ఇంటికి వచ్చికమలను అడగగా ఆమె మనకొక ఇల్లుకావాలనిఅడిగిరండి అన్నది. ముని ప్రభావం వల్ల వారికోసం ఒక అందమైన ఇల్లు వెలసింది. కొన్నాళ్లకు ఆమెకు పెద్ద మేడలో ఉండాలనే కోరిక కలిగింది.మునిని అడిగి రమ్మని భర్తను అడవికి పంపింది. ముని సరే అనడంతో ఆమర్నాడు మేడ ప్రత్యక్షమైంది. కొంత కాలం గడిచాక కమలకు ఆ రాజ్యానికి తానే రాణి కావాలనే కోరిక పుట్టిదంది. మరలా భర్తను ముని వద్దకు పంపింది. ముని సరే అనడంతో కొద్దికోజుల్లోనే వారిద్దరూ ఆ రాజ్యానికి రాజు ,రాణి అయ్యారు. కొంతకాలం తర్వాత మరలా ముని వద్దకు వెళ్లాడు రంగా ఈసారి ఏం కోరికతో వచ్చావు అని అడిగిన మునితో స్వామీ నా భార్య సూర్య చంద్రులు తనింటనే ఉండేలా వరం అడిగి రమ్మంది అన్నాడు. ఆ మాటలు విన్నముని ఎంతస్వార్థమైన కోరిక ఇది అనుకుంటూ సూర్య చంద్రులు మీ ఇంటనే ఉండాలంటే మీరిద్దరూ ఒక చెట్టు కింద ఉంటేసరి అన్నాడు రంగా తన భవనం వద్దకు వచ్చేసరికి కమలబాధగా చెట్టు కింద కూర్చుని కనిపించింది. మన సంపద మన భవనం అంతా మాయం ఐపోయిందండి అని బాధగా అన్నది. ఉన్నదానితో తృప్తిపడలేని నీ అత్యాశ చూసావా మనకు ఎలాంటి పరిస్థితి తెచ్చిపెట్టిందో అన్నాడు రంగా.
ఇకపై ఉచితంగా దొరికేవాటికి ఆశపడకుండా ఉన్నదానితో సర్దుకుని కష్టపడి పనిచేసి సంపాదించుకుందాం అండి అన్నది కమల. ఆమెలో వచ్చిన ఈ మార్పుకు రంగా చాలా సంతోషించాడు.