Pawan Kalyan: ఢిల్లీ పర్యటనలో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన పవన్ కల్యాణ్!
ABN , Publish Date - Mar 09 , 2024 | 03:08 PM
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు (AP Politics) శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాకమునుపే కీలక పరిణామాలు చోటుచేసుకుంటూ ఉండటంతో.. షెడ్యూల్ వచ్చాక పరిస్థితి ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. ఇప్పటి వరకూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఎమ్మెల్యేగా పోటీచేస్తారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మొదటి జాబితాలో పవన్ పేరు లేకపోవడంతో రెండో జాబితాలో పక్కాగా ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే.. ఢిల్లీ పర్యటన తర్వాత జనసేనాని పవన్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. .
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు (AP Politics) శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాకమునుపే కీలక పరిణామాలు చోటుచేసుకుంటూ ఉండటంతో.. షెడ్యూల్ వచ్చాక పరిస్థితి ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. ఇప్పటి వరకూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఎమ్మెల్యేగా పోటీచేస్తారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మొదటి జాబితాలో పవన్ పేరు లేకపోవడంతో రెండో జాబితాలో పక్కాగా ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే.. ఢిల్లీ పర్యటన తర్వాత జనసేనాని పవన్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఢిల్లీ పెద్దల సూచన మేరకు ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేతో పాటు.. ఎంపీగా పోటీ చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాకినాడ (Kakinada) ఎంపీగా పవన్ పోటీచేస్తారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఎమ్మెల్యేగా మాత్రం పిఠాపురం నుంచే పోటీ చేయవచ్చని జనసేన పెద్దలు చెబుతున్నారు. ఈ లెక్కన అయితే.. పార్లమెంట్ స్థానం పరిధిలోకే అసెంబ్లీ కూడా వస్తుంది.
YSRCP: ఒక ఎంపీ.. ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చిన వైఎస్ జగన్.. సడన్‌గా ఇలా జరగడంతో..!?
కాకినాడ నుంచే ఎందుకు..?
ఎంపీగా పోటీచేస్తే.. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల వరకు ప్రభావితం చేయవచ్చన్నది ప్రధాన టార్గెట్ అని తెలుస్తోంది. కాకినాడ కీలక నియోజకవర్గం కావడం.. ఈ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాలన్నింటిలోనే కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండటంతో ఇక్కడ్నుంచే పోటీచేయాలని పవన్ భావిస్తున్నట్లు సమాచారం. కాకినాడ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, జగ్గంపేట, పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గాలు కాకినాడ పరిధిలోకి వస్తాయి. ఎంపీగా పోటీచేస్తే ఎన్డీయేలో భాగస్వామిగా కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా ఎమ్మెల్యేతో పాటు ఎంపీగా రెండు స్థానాల్లో పోటీచేస్తారని వార్తలు వచ్చినప్పటికీ తాజా హస్తిన పర్యటనతో ఇది కన్ఫామ్ అయినట్లు స్పష్టంగా అర్థమవుతోంది.
Kodali Nani: కొడాలి నాని సంచలన నిర్ణయం.. కంగుతిన్న వైసీపీ!
అధికార ప్రకటనే..!
అన్నీ అనుకున్నట్లు జరిగితే ఢిల్లీ పర్యటన ముగిసిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి పవన్ మీడియా మీట్ నిర్వహిస్తారని.. ఈ సందర్భంగా ఎంపీగా పోటీపై అధికారిక ప్రకటన చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మొత్తమ్మీద శనివారం సాయంత్రానికి ఓ క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. అంటే అంతా అయిపోయింది కానీ.. అధికారిక ప్రకటన మాత్రమే మిగిలుందన్న మాట. తొలి జాబితాలో రిలీజ్ చేయడం మొదలుకుని ఇప్పటి వరకూ టీడీపీ-జనసేన కూటమి చాలా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తూ వస్తోందన్న విషయం తెలిసిందే. అధికార వైసీపీకి ఏ మాత్రం ఊహకందని రీతిలో వ్యూహాలు రచిస్తున్నారు ఇరు పార్టీల అధినేతలు. మున్ముందు చంద్రబాబు, పవన్‌ల వ్యూహాలు ఇంకా ఎన్నెన్ని బయటికొస్తాయో వేచి చూడాల్సిందే మరి.
మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి