Anant Ambani Wedding: అంబానీ అంటే ఆ మాత్రం ఉండాలి.. స్నేహితులకు రూ. 2 కోట్ల ఖరీదైన వాచ్‌లు.. షారూక్, రణ్వీర్‌లకు కూడా..
ABN , Publish Date - Jul 14 , 2024 | 12:13 PM
ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం ముంబైలో అత్యంత ఘనంగా జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ వివాహం కోసం అంబానీ కుటుంబం ఏకంగా రూ.5 వేల కోట్లు ఖర్చు పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి.
ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ (Mukesh Ambani) చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani) వివాహం ముంబైలో అత్యంత ఘనంగా జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఈ కార్యక్రమానికి (Anant Ambani Wedding) హాజరయ్యారు. ఈ వివాహం కోసం అంబానీ కుటుంబం ఏకంగా రూ.5 వేల కోట్లు ఖర్చు పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. అందులో నిజమెంతుందో తెలియదు కానీ, పెళ్లి సందర్భంగా తన స్నేహితులకు, బాలీవుడ్ హీరోలకు అనంత్ అంబానీ ఇచ్చిన బహుమతులు మాత్రం కళ్లు చెదిరేలా ఉన్నాయి (Costly Gifts).
తన స్నేహితులు ఒక్కొక్కరికీ అనంత్ అంబానీ రూ.2 కోట్ల విలువైన బంగారు వాచీలను బహూకరించాడు. ``ఆడెమర్స్ పిగ్వేట్`` లగ్జరీ బ్రాండ్‌కు చెందిన వాచ్‌లను (Audemars Piguet watches) బహుమతులుగా అందించాడు. ఆ ఖరీదైన వాచీలను అందుకున్న వారిలో బాలీవుడ్ హీరోలు షారూక్ ఖాన్, రణ్‌వీర్ సింగ్ కూడా ఉన్నారు. ఈ వాచీలో 41 ఎంఎం 18 క్యారట్ల పింక్ గోల్డ్ కేస్, సఫైర్ స్టోన్ క్రిస్టల్ బ్యాక్, స్క్రూ లాక్ క్రోన్ ఉన్నాయి. గోల్డ్ టోన్డ్ డయల్, బ్లూ కౌంటర్లు, పింక్ గోల్డ్ తో పొదిగిన నెంబర్లు ఉన్నాయి. ఈ ఆటోమెటెడ్ వాచీ వారం, రోజు, తేదీ, ఖగోళ చంద్రుడి వివరాలు, నెల, లీప్ సంవత్సరం, గంటలు, నిమిషాలను చూపించే శాశ్వత క్యాలెండర్ ను కలిగి ఉంటుంది.
ఈ వాచీలను బహుమతులుగా అందుకున్న అందరూ తీయించుకున్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంది. ఈ ఫొటోలపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ``అనంత్ లాంటి స్నేహితుడు ఉంటే చాలు``, ``రేపు అనేది లేనట్టుగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు``, ``ఇలాంటి పెళ్లి ఇంతకు ముందు ఇండియాలో జరగలేదేమో``, ``ఇది నిజంగా వైభవం``, ``ఈ పెళ్లి గురించి తెలుసుకున్న విదేశీయులు భారత్ పేద దేశం అంటే నమ్మరు`` అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Anant Ambani: అనంత్ అంబానీ మళ్లీ బరువు ఎందుకు పెరిగాడు? 108 కిలోలు తగ్గిన తర్వాత ఏం జరిగింది..?
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..