Share News

Viral Video: అన్నా అంత తొందరెందుకు.. రాంగ్ రూట్‌లో వచ్చిన బైకర్‌కు ఆర్మీ మ్యాన్ ఇచ్చిన కోటింగ్ మామూలుగా లేదు!

ABN , Publish Date - Aug 26 , 2024 | 05:29 PM

రద్దీగా ఉండే రోడ్లపై ప్రయాణించేటపుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ డ్రైవింగ్ చేయాలి. కానీ కొన్నిసార్లు కొంతమంది షార్ట్ కట్‌ రూట్లలో వెళ్లడానికి ప్రయత్నించి తమతో పాటు ఇతరులకు కూడా ప్రమాదకరంగా పరిణమిస్తారు.

Viral Video: అన్నా అంత తొందరెందుకు.. రాంగ్ రూట్‌లో వచ్చిన బైకర్‌కు ఆర్మీ మ్యాన్ ఇచ్చిన కోటింగ్ మామూలుగా లేదు!
Road Rage Incident Video

రద్దీగా ఉండే రోడ్లపై ప్రయాణించేటపుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ట్రాఫిక్ నియమాలను (Traffice Rules) పాటిస్తూ డ్రైవింగ్ చేయాలి. కానీ కొన్నిసార్లు కొంతమంది షార్ట్ కట్‌ రూట్లలో వెళ్లడానికి ప్రయత్నించి తమతో పాటు ఇతరులకు కూడా ప్రమాదకరంగా పరిణమిస్తారు. అలాంటి వారికి తగిన బుద్ధి చెబుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాంగ్ రూట్‌లో (wrong root) వచ్చి అడ్డంగా బుకాయిస్తున్న బైకర్‌ (Biker)కు ఓ ఆర్మీ సైనికుడు (Army Man) తనదైన శైలిలో కోటింగ్ ఇచ్చాడు. ఆ వీడియో నెట్టింట హల్‌‌చల్ చేస్తోంది (Viral Video).


@ThePlacardGuy అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో సిగ్నల్ పడింది. వాహనాలన్నీ ఆగి ఉన్నాయి. అయితే ఓ బైకర్ రాంగ్ రూట్‌లో వెళ్లిపోవడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో ఓ కార్ అటు వైపు వస్తోంది. అయినా ఆ బైకర్ వెనక్కి వెళ్లకుండా ఆ కార్ డ్రైవర్‌నే వెనక్కి వెళ్లాలని సైగలు చేశాడు. ఆ బైకర్ ప్రవర్తన పక్కనే ట్రక్కులో ఉన్న ఆర్మీ సైనికుడికి ఆగ్రహం కలిగించింది. వెంటనే కిందకు దిగి ఆ బైకర్‌ను రెండు సార్లు కొట్టాడు. అనంతరం ట్రక్కు నుంచి కర్ర కూడా తీసి కొట్టబోయాడు. అదే సమయంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా అక్కడకు వచ్చి ఆ బైకర్‌ను పక్కకు తీసుకెళ్లింది.


ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 4.5 లక్షల మంది వీక్షించారు. 10 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``తృప్తికరమైన రోడ్ రేజ్ వెర్షన్ వీడియో``, ``ఈ రోడ్డు మా నాన్నది అనే మనస్తత్వం నుంచి అందరూ బయటకు రావాలి``, ``ఈ మూర్ఖులకు అవసరమైన చికిత్స ఇదే``, ``దండించే వాళ్లు ఉంటేనే చాలా మంది నియమాలను పాటిస్తారు`` అంటూ సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: నాగుపాము పడగ విప్పితే.. పెద్ద పులి అయినా తోకముడవాల్సిందే.. వీడియో వైరల్!


Viral: ఫోన్ పోయిందని కంప్లైంట్ ఇవ్వడానికి వెళితే జిలేబీ తెమ్మన్నారు.. అసలు కథ ఏంటంటే..!


Optical Illusion: మీ కళ్ల సామర్థ్యానికి పరీక్ష.. ఈ ఫొటోలో భిన్నంగా ఉన్న కుక్క ఎమోజీని కనిపెట్టండి..!


Viral Video: పెళ్లి పీటలెక్కబోయే ముందు కూడా స్కూల్‌కు వెళ్లి పాఠాలు చెప్పిన టీచర్.. అసలు కారణమేంటంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 26 , 2024 | 05:29 PM