Share News

Viral Video: దయచేసి పిల్లలపై ఓ కన్నేసి ఉంచండి.. ఈ వీడియోలోని చిన్నారికి ఏం జరిగిందో చూస్తే షాకవ్వాల్సిందే..!

ABN , Publish Date - Aug 05 , 2024 | 04:15 PM

పూర్తిగా ఊహ తెలియని పిల్లలను ఎప్పుడూ ఓ కంట కనిపెడుతూ ఉండాల్సిందే. వారు ఏం చేస్తున్నా, ఆడుకుంటున్నా వారిపై ఓ కన్నేసి ఉంచాల్సిందే. లేకపోతే వారు ప్రమాదాలకు గురయ్యే ఆస్కారం చాలా ఎక్కువ. అభం శుభం తెలియని అమాయకులైన పిల్లల విషయంలో పెద్దలు అప్రమత్తంగా ఉండాలి.

Viral Video: దయచేసి పిల్లలపై ఓ కన్నేసి ఉంచండి.. ఈ వీడియోలోని చిన్నారికి ఏం జరిగిందో చూస్తే షాకవ్వాల్సిందే..!
Child fell in drain water

పూర్తిగా ఊహ తెలియని పిల్లలను (Child) ఎప్పుడూ ఓ కంట కనిపెడుతూ ఉండాల్సిందే. వారు ఏం చేస్తున్నా, ఆడుకుంటున్నా వారిపై ఓ కన్నేసి ఉంచాల్సిందే. లేకపోతే వారు ప్రమాదాలకు గురయ్యే ఆస్కారం చాలా ఎక్కువ. అభం శుభం తెలియని అమాయకులైన పిల్లల విషయంలో పెద్దలు అప్రమత్తంగా ఉండకపోతే ఒక్కోసారి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే నివ్వెరపోవాల్సిందే. ఓ చిన్నార మురుగు నీటిలో (Drain Water) పడిపోయిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral Video).

ABN ఛానల్ ఫాలో అవ్వండి

వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఇద్దరు పిల్లలు ఓ మురుగు కాలువ పక్కన తిరుగుతూ ఆడుకుంటున్నారు. అమ్మాయిని చూసి కాలువ దగ్గరకు వచ్చిన చిన్న పిల్లవాడు అందులో పడిపోయాడు. దీంతో ఆ పాప సహాయం కోసం కేకలు వేయడం ప్రారంభించింది. సమీపంలోని మెట్లు ఎక్కి పెద్దగా అరిచింది. కొందరు వ్యక్తులకు విషయం తెలిసి అక్కడకు వచ్చినా వారు ఆ బాలుడిని కాపాడేందుకు ప్రయత్నించలేదు. కొన్ని సెకన్ల తర్వాత, ఒక వ్యక్తి పక్క ఇంటి నుంచి బయటకు వచ్చి, కాలువలోకి దూకి నీటిలో ఉన్న పిల్లవాడిని బయటకు తీశాడు.


ఆ కాలువ ఎక్కువ లోతు లేకపోవడంతో పిల్లాడు ప్రాణాలతో బయటపడగలిగాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు 7 లక్షల మందికి పైగా వీక్షించారు. 2.65 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఆ దేవుడికి కోటి దండాలు``, ``ఆ అమ్మాయి వల్లే ఆ కుర్రాడు బతికాడు``, ``పిల్లలు ఎక్కడ ఆడుతున్నారో చూస్తుండాలి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: డ్రైనేజ్‌లో భారీ సర్పం.. దానిని పట్టుకోవడానికి ఆ వ్యక్తి ఉపయోగించిన ట్యాలెంట్ చూస్తే అభినందించాల్సిందే..


Optical Illusion: మీ బ్రెయిన్ స్పీడ్‌కు టెస్ట్.. ఈ ఫొటోలో మేకుల మధ్య ఉన్న స్ప్రింగ్‌ను 10 సెకెన్లలో కనిపెట్టండి..!


Viral: స్టూడెంట్ ఇలా రాస్తే టీచర్ మాత్రం ఏం చేస్తుంది.. మార్కులు వేయకుండా ఉంటుందా? వైరల్ అవుతున్న ఆన్సర్ షీట్!


Viral Video: అర్జెంట్ అని వెళితే స్మార్ట్ టాయిలెట్ ఎంత పని చేసిందో చూడండి.. వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు..!


Viral: తులం బంగారం ధర 1959లో ఎంతో తెలుసా? విపరీతంగా వైరల్ అవుతున్న పాత గోల్డ్ బిల్..!

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 05 , 2024 | 04:15 PM

News Hub