Viral Video: వామ్మో.. ఇతడు యమధర్మరాజు చుట్టంలా ఉన్నాడే.. చిచ్చు బుడ్డిని ఎలా కాలుస్తున్నాడో చూడండి..
ABN , Publish Date - Dec 23 , 2024 | 05:52 PM
పెళ్లిళ్లలో చోటు చేసుకున్న ఆసక్తికర ఘటనలు, ఫన్నీ సమయాలకు సంబంధించిన వీడియోలు మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పెళ్లి ఊరేగింపుల్లో కొందరు వ్యక్తులు చేసే విచిత్రమైన పనులు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి.
మన దేశంలో ఇటీవలె పెళ్లిళ్ల (Wedding) సీజన్ ముగిసింది. అయితే ఆయా పెళ్లిళ్లలో చోటు చేసుకున్న ఆసక్తికర ఘటనలు, ఫన్నీ సమయాలకు సంబంధించిన వీడియోలు మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పెళ్లి ఊరేగింపుల్లో (Wedding procession) కొందరు వ్యక్తులు చేసే విచిత్రమైన పనులు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి బాణాసంచాను (Crackers) కాల్చిన విధానం చాలా మందికి షాక్ కలిగిస్తోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు (Viral Video).
anishyadav7074 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ పెళ్లి ఊరేగింపు జరుగుతోంది. పెళ్లి ఊరేగింపులో బాణాసంచా కాల్చుతారనే సంగతి తెలిసిందే. అలాంటి సందర్భంలో ఓ వ్యక్తి చిచ్చు బుడ్డిని ఏకంగా తన నోట్లో పెట్టుకుని కాల్చాడు. నిప్పులు చిమ్ముతున్న చిచ్చుబుడ్డిని నోట్లో పెట్టుకుని మరీ డ్యాన్స్ చేశాడు. అతడి సాహసాన్ని చూసి చుట్టు పక్కల వాళ్లు ఆశ్చర్యపోయారు. ఆ వ్యక్తి సాహసాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 30 లక్షల మంది వీక్షించారు. 74 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేశారు. ``తేడా వస్తే పళ్లన్నీ రాలిపోతాయి``, ``ఒకవేళ అది పేలి ఉంటే అతడు నోటితో ఇంకేమీ తినలేడు``, ``ఇతడు యమరాజుకు చుట్టంలా ఉన్నాడు`` అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేశాడు.
ఇవి కూడా చదవండి..
Viral Video: వామ్మో.. టైర్ పేలితే ఎఫెక్ట్ ఇలా ఉంటుందా? ఆ వ్యక్తి గాల్లోకి ఎలా ఎగిరిపడ్డాడో చూడండి..
Viral Video: కారు ముందుకు వెళ్లకుండా చుట్టుముట్టిన ఆవులు.. ఆసలేం జరిగిందో తెలిస్తే.. వీడియో వైరల్..
Oreo Biscuits: వామ్మో.. ఓరియో బిస్కెట్స్ అంత ప్రమాదకరామా? బిస్కెట్లలో కేన్సర్ కారక రసాయనాలు..?
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి