Share News

Viral video: భయంకర ప్రమాదం.. ఎలక్ట్రిక్ వైర్ తెగి నీటిలో పడడంతో ఏం జరిగిందో చూడండి.. వీడియో వైరల్..

ABN , Publish Date - Oct 21 , 2024 | 01:55 PM

నీరు నిలిచిన ప్రదేశాల్లో ఉన్న కరెంట్ స్తంభాల దగ్గర నడిచేటపుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ప్రాణాలు కోల్పోయేంత ప్రమాదం ఎదురవుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో చూసిన భయంతో హడలిపోతున్నారు.

Viral video: భయంకర ప్రమాదం.. ఎలక్ట్రిక్ వైర్ తెగి నీటిలో పడడంతో ఏం జరిగిందో చూడండి.. వీడియో వైరల్..
Flames were seen in the water due to the electric wire

వర్షాకాలంలో (Rainy Season) చాలా రోడ్లపై (Roads) నీళ్లు నిలిచిపోతాయి. అలా నీళ్లు (Water) నిలిచిపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతాయనే సంగతి తెలిసిందే. అయితే ఒక్కోసారి ఊహించని భయంకర పరిస్థితులు కూడా ఎదురవుతాయి. ముఖ్యంగా నీరు నిలిచిన ప్రదేశాల్లో ఉన్న కరెంట్ స్తంభాల (Electric Poles) దగ్గర నడిచేటపుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ప్రాణాలు కోల్పోయేంత ప్రమాదం ఎదురవుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో చూసిన భయంతో హడలిపోతున్నారు (Viral Video).


saiedhamza80 అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. వర్షం కారణంగా ప్రధాన రహదారిపై నీరు నిలిచిపోయింది. రోడ్డులో చాలా భాగం నీటితో నిండిపోయింది. అదే సమయంలో కరెంట్ స్తంభం నుంచి వైర్ తెగిపోయి ఆ నీటిలో పడింది. దీంతో మంటలు చెలరేగాయి. దీపావళి టపాసులు పేల్చినట్టు ఆ నీటి నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. అయినా ఎవరూ పట్టించుకోకుండా రోడ్డు పై నుంచి వెళ్లిపోతున్నారు. స్థానికులు ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 40 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. 92 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``హ్యాపీ దివాళి``, ``విద్యుత్ శాఖ ముందుగానే దీపావళి జరుపుకుంటోంది``, ``ఇది ఎంతటి ప్రమాదకరం``, ``ఎవరూ పట్టించుకోవడం లేదేంటి``, ``ఇండియన్లు తమ జీవితాల గురించి పెద్దగా పట్టించుకోరు``, ``ఆ నీటిలోకి వెళ్లిన వారి పరిస్థితి ఏంటి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 21 , 2024 | 01:55 PM