Share News

Viral: అకస్మాత్తుగా స్పృహ కోల్పోయిన మహిళ.. ఇన్సూరెన్స్ ఉందన్న నమ్మకంతో ఆసుపత్రిలో చేరితే..

ABN , Publish Date - Apr 22 , 2024 | 06:52 PM

హెల్త్ ఇన్సూరెన్స్ ఉందన్న నమ్మకంతో ఆసుపత్రిలో చేరిన మహిళకు సంస్థ హ్యాండిచ్చింది. దీంతో, తిక్కరేగిన బాధితురాలు వెంటనే సంస్థ తీరును నెట్టింట ఎండగట్టింది.

Viral: అకస్మాత్తుగా స్పృహ కోల్పోయిన మహిళ..  ఇన్సూరెన్స్ ఉందన్న నమ్మకంతో ఆసుపత్రిలో చేరితే..

ఇంటర్నెట్ డెస్క్: హెల్త్ ఇన్సూరెన్స్ ఉందన్న నమ్మకంతో ఆసుపత్రిలో చేరిన మహిళకు సంస్థ హ్యాండిచ్చింది. దీంతో, తిక్కరేగిన బాధితురాలు వెంటనే సంస్థ తీరును నెట్టింట ఎండగట్టింది. ఘటన వైరల్ (Viral) అయి సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో వెంటనే ఆ సంస్థ స్పందించడమే కాకుండా ఆమె ఫైల్‌ను పునఃపరిశీలిస్తామని హామీ ఇచ్చింది.

Viral: వామ్మో.. లీటరు గాడిద పాలు రూ.7 వేలు! కోట్లల్లో ఆర్జిస్తున్న వ్యాపారి!


ప్రీతీ చౌబే అనే మహిళ హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ వద్ద హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంది. ఆమె గతంలో విలేకరిగా పనిచేశారు. అయితే, ఇటీవల ఆమె హఠాత్తుగా స్పృహకోల్పోవడంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆమె బీమా మొత్తం కోసం ప్రయత్నించగా సంస్థ ఆమె అభ్యర్థనను తిరస్కరించింది. టెన్షన్ కారణంగా ఆమెకు ఈ పరిస్థితి తలెత్తింది కాబట్టి కవరేజీ లేదని పేర్కొంది. దీంతో, తిక్కరేగిన ప్రీతి తనకెదురైన చేదు అనుభవం గురించి నెట్టింట పంచుకుంది (HDFC In Hot Water After Ex-journalist Denied Coverage For Medical Emergency).

Viral: ఇంత నీచానికి ఎందుకు దిగజారుతారో? ఈమె 10వ తరగతి స్టేట్ ర్యాంకర్ అని తెలిసినా..


తాను ఇన్సూరెన్స్ నమ్ముకుని మునిగిపోయాని, తనకు మరోదారి లేదని ఆమె కామెంట్ చేసింది. దీంతో, క్షణాల్లో ఆమె ఉదంతం వైరల్ అయిపోయింది. ఏకంగా 1.5 మిలియన్‌ల వ్యూస్ వచ్చాయి. ఇన్సూరెన్స్ సంస్థపై జనాలు దుమ్మె్త్తిపోశారు. ఇదంతా పెద్ద మోసమంటూ మండిపడ్డారు. తామూ ఇలాంటి అనేక అనుభవాలు ఎదుర్కొన్నామని చెప్పారు. నెట్టింట విమర్శల జడి పెరుగుతుండటంతో ఇన్సూరెన్స్ సంస్థ స్పందించింది. ఆమెకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామన్న సంస్థ, ఆమె పాలసీ నెంబర్‌ను నేరుగా మెసేజ్ చేస్తే విషయంపై మరోసారి దృష్టిసారిస్తామని హామీ ఇచ్చింది.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 22 , 2024 | 07:01 PM