Share News

Viral Video: ఆర్మీని తలదన్నేలా సింహం ట్రైనింగ్.. పిల్లలను చెట్టు ఎలా ఎక్కిస్తుందో చూడండి..

ABN , Publish Date - Apr 20 , 2024 | 09:41 PM

పులులు, సింహాలు మిగతా జంతువులకు భయంకరంగా కనిపించినా.. వాటి పిల్లలకు మాత్రం అవి ఎంతో ప్రేమ కురిపించే తల్లులే. వాటికి నడక దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ అవి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం చూస్తూ ఉంటాం. ఇలాంటి వీడియోలు ..

Viral Video: ఆర్మీని తలదన్నేలా సింహం ట్రైనింగ్.. పిల్లలను చెట్టు ఎలా ఎక్కిస్తుందో చూడండి..

పులులు, సింహాలు మిగతా జంతువులకు భయంకరంగా కనిపించినా.. వాటి పిల్లలకు మాత్రం అవి ఎంతో ప్రేమ కురిపించే తల్లులే. వాటికి నడక దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ అవి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం చూస్తూ ఉంటాం. ఇలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ సింహం తన పిల్లలకు చెట్టు ఎక్కడంపై ట్రైనింగ్ ఇవ్వడం చూసి అంతా అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. దక్షిణాఫ్రికా (South Africa) అడవుల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ సింహం (lion) తన పిల్లలకు చెట్టు ఎక్కడంపై ట్రైనింగ్ ఇవ్వాలని అనుకుంటుంది. ఇందుకోసం అది వాటి నుంచి దూరంగా వెళ్లి చెట్టు ఎక్కుతుంది. తర్వాత తన పిల్లలను చెట్టు పైకి వచ్చేలా చిన్న చిన్న అరుపులతో పిలుస్తుంది. తల్లి వద్దకు వెళ్లాలని పిల్లలంతా చెట్టు వద్దకు వెళ్తాయి.

Viral Video: పెళ్లి వేదికపై షాకింగ్ ఘటన.. పురోహితుడు మంత్రాలు చదువుతుండగా.. ఉన్నట్టుండి..

అయితే వాటిలో ఓ పిల్ల మాత్రమే త్వరగా చెట్టు ఎక్కి తల్లి వద్దకు వెళ్తుంది. చెట్టు ఎక్కడం నేర్చుకున్న తన పిల్లను ఎంతో ప్రేమగా ముద్దాడుతూ ‘‘శభాష్’’.. అన్నట్లుగా ప్రేమ కురిపిస్తుంది. మిగతావి ఎంతో ప్రయత్నించినా చెట్టు సగం వరకు మాత్రమే ఎక్కుతాయి. ఈ ఘటనను అక్కడే ఉన్న పర్యాటకులు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ సింహం ట్రైనింగ్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘తల్లి ప్రేమ అంటే ఇలాగే ఉంటుంది మరి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఎలుగుబంటికి కోపం వస్తే పులి కూడా పిల్లే.. దాడి చేయాలని చూసిన పులిని..

Updated Date - Apr 20 , 2024 | 09:41 PM