Viral Video: ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా.. గాల్లోకి ఎగరేస్తూ చిటికెలో ఆకుకూరల టీ ఎలా చేశాడో చూడండి..
ABN , Publish Date - Apr 20 , 2024 | 07:24 PM
ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంటే.. కొందరికైతే మల్టీ టాలెంట్ ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడతో ఇలాంటి వారి టాలెంట్.. చిటికెలో ప్రపంచానికి తెలిసిపోతోంది. వినూత్నంగా టీ తయారు చేసేవారిని చూశాం. గాల్లోకి ఎగురవేస్తూ టీ తయారు చేసే డాలీ చాయ్‌వాలాను కూడా చూశాం. ఇలాంటి...
ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంటే.. కొందరికైతే మల్టీ టాలెంట్ ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడతో ఇలాంటి వారి టాలెంట్.. చిటికెలో ప్రపంచానికి తెలిసిపోతోంది. వినూత్నంగా టీ తయారు చేసేవారిని చూశాం. గాల్లోకి ఎగురవేస్తూ టీ తయారు చేసే డాలీ చాయ్‌వాలాను కూడా చూశాం. ఇలాంటి వారికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వ్యక్తి ఆకుకూరలతో టీ తయారు చేయడమే కాకుండా.. అతడు చేసే విధానం కూడా సరికొత్తగా ఉండడంతో నెటిజన్లు అభినందిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి టీని వినూత్నంగా (Make tea innovatively) తయారు చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. స్టవ్‌పై రాగి పాత్రలో టీ వేడి చేసిన ఆ వ్యక్తి.. గరిటెను అటూ ఇటూ కొడుతూ, గాల్లోకి విసిరేస్తూ తనదైన స్టైల్ చూపించాడు. తర్వాత పాల ప్యాకెట్‌ను కూడా అంతెత్తున గాల్లోకి విసిరి, మళ్లీ పట్టుకుని అంతే స్టైల్‌గా చించేసి పాలను పాత్రలో పోస్తాడు. ఆ తర్వాత అందులో గోధుమ గడ్డి, కొత్తిమీరను ముక్కలు ముక్కలు కత్తిరించి అందులో మిక్స్ చేస్తాడు.
చివరగా అందులో టీపొడి, అల్లం పేస్ట్, చక్కెర జత చేసి వేడి చేస్తాడు. ఫైనల్‌గా రెడీ అయిన టీని కూడా తనదైన స్టైల్లో వడపోసి కస్టమర్లకు అందిస్తాడు. ఆకుకూరలతో టీ చేయడమే కాకుండా.. అంతా మైమరిచే విధంగా అతడు చేసిన టీ మేకింగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్..! చూస్తుంటేనే వెళ్లి తాగాలి అనిపిస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘ఆకుకూరలతో టీ.. అద్భుతం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.40లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Marriage Video: పెళ్లి వేదికపై వరుడి కక్కుర్తి.. వధువు పక్కనే కూర్చుని.. ఆమెకు తెలీకుండానే..