Share News

Viral: విద్యార్థుల గొడవ.. టీచర్ పరిగెత్తుకుంటూ క్లాస్‌రూంలోకి వెళితే..

ABN , Publish Date - Sep 17 , 2024 | 09:31 PM

టీచర్స్ డే రోజున విద్యార్థులు ప్లే చేసిన ఓ ప్రాంక్ తాలూకు వీడియో నెట్టింట ఆకట్టుకుంటోంది. తమ టీచర్‌పై విద్యార్థులకు ఉన్న ఆపేక్ష, స్టూడెంట్స్‌పై టీచర్‌కు ఉన్న శ్రద్ధ నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది.

Viral: విద్యార్థుల గొడవ.. టీచర్ పరిగెత్తుకుంటూ క్లాస్‌రూంలోకి వెళితే..

ఇంటర్నెట్ డెస్క్: తమను సక్రమమార్గంలో నడిపించే ఉపాధ్యాయులంటే విద్యార్థులకు ఎనలేని గౌరవం. అందుకే, ఉపాధ్యాయుల దినోత్సవాన్ని వారొక పండగలా జరుపుకుంటారు. ఆ రోజు టిచర్లకు రకరకాల గిఫ్ట్‌లు, శుభాకాంక్షలతో తమ గౌరవాభిమానాలు చాటుకుంటారు. కానీ కాలంతో పాటు సెలబ్రేషన్స్‌లోనూ మార్పు వస్తోంది. ఇందుకు తాజాగా ఉదాహరణగా ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ (Viral) అవుతోంది.

Russia: ఆఫీసుల్లో శృంగారంలో పాల్గొనండి.. రష్యా అధ్యక్షుడి కొత్త సూచన!


మహారాష్ట్రలోని కరాడ్‌లోగల జయ్‌వంత్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, క్లాస్ రూంలో స్టూడెంట్స్ గొడవపడుతున్న విషయాన్ని కొందరు విద్యార్థులు వెళ్లి టీచర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో, కంగారుపడిపోయిన టీచర్ పరిగెత్తుకుంటూ కాస్ల్ రూంలోకి వెళ్లారు. కానీ ఆమె రాంగానే విద్యార్థులు సెడెన్‌గా గొడవ ఆపేసి మూకుమ్మడిగా ఆమెకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కన్‌ఫెట్టీ పేల్చి సెలబ్రేట్ చేశారు. ఇదంతా చూసి క్షణకాలం పాటు దిమ్మెరపోయిన టీచర్ ఆ తరువాత విషయం అర్థమై విద్యార్థులతో పాటు మనసారా నవ్వారు.

Viral: పొట్టపై సాలీడు కుడితే ఇంత ప్రమాదమా! ఇతడికి ఏమైందో తెలిస్తే..


వైరల్ గా మారిన ఈ వీడియోపై జనాలు పెద్ద ఎత్తున స్పందించారు. టీచర్స్ డే రోజున ఇవ్వాల్సిన అసలైన బహుమతి అంటే ఇదీ అంటూ కామెంట్ చేశారు. ఈ ప్రాంక్‌ను టీచర్ కూడా మెచ్చుకోకుండా ఉండలేకపోయారని మరో వ్యక్తి అన్నారు. మరికొందరు మాత్రం ఆ టీచర్‌ విద్యార్థులపై చూపిస్తున్న శ్రద్ధ బాగా ఆకట్టుకుంది. అందుకే ఆ విద్యార్థులకు తమ టీచర్ అంటే అంత ఆపేక్ష అని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో వైరల్ అవుతోంది.

Viral: తల్లి ఇంట్లో లేకపోతే ఇంతే.. పిల్లలను రిస్క్‌లో పడేసిన తండ్రి!

Viral: ఈ రక్తం ధర లీటరుకు రూ.12 లక్షలు! ఇంత ఖరీదు ఎందుకో తెలిస్తే..

ReadLatest andViral News

Updated Date - Sep 17 , 2024 | 09:34 PM