Share News

Viral Video: కారు బానెట్ ఓపెన్ చేసిన వ్యక్తికి షాక్.. లోపల ఏం ఉందో చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

ABN , Publish Date - Sep 15 , 2024 | 11:41 AM

వర్షా కాలం వచ్చిందంటే చాలు పాములు బయటకు వస్తాయి. చెట్లు, తుప్పలు ఎక్కువగా ఉండే ఇళ్లలోకి ప్రవేశిస్తుంటాయి. ఇళ్లలోని పలు ప్రాంతాల్లో, వస్తువుల్లో దాక్కుని ఉంటాయి. పాములే కాదు.. కొండ చిలువలు కూడా జనావాస ప్రాంతాల్లోకి వచ్చేస్తుంటాయి.

Viral Video: కారు బానెట్ ఓపెన్ చేసిన వ్యక్తికి షాక్.. లోపల ఏం ఉందో చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..
Python found inside car bonnet

వర్షా కాలం (Rainy Season) వచ్చిందంటే చాలు పాములు (Snake) బయటకు వస్తాయి. చెట్లు, తుప్పలు ఎక్కువగా ఉండే ఇళ్లలోకి ప్రవేశిస్తుంటాయి. ఇళ్లలోని పలు ప్రాంతాల్లో, వస్తువుల్లో దాక్కుని ఉంటాయి. పాములే కాదు.. కొండ చిలువలు (Pythons) కూడా జనావాస ప్రాంతాల్లోకి వచ్చేస్తుంటాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత పాములు, కొండ చిలువలకు సంబంధించిన ఎన్నో వీడియోలు (Snake videos) మన కళ్ల ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


వైరల్ అవుతున్న తాజా వీడియోను ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లో చిత్రీకరించారు. యూపీలోని ప్రయోగరాజ్‌లో రోడ్డుపై పార్క్ చేసి ఉన్న ఓ కారు బానెట్‌ (Car bonnet)లోకి ఏడడుగుల కొండచిలువ ప్రవేశించింది. ఓనర్ వచ్చి కారు బానెట్ ఓపెన్ చేయగానే కనిపించన కొండచిలువను చూసి అతడు షాకయ్యాడు. వెంటనే వన్య ప్రాణుల సంరక్షణ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వారు వచ్చి ఆ కొండచిలువను సురక్షితంగా బయటకు తీసి సమీప అడవిలోకి పంపించేశారు. ఆ కొండచిలువను అధికారులు కాపాడగానే చుట్ట ఉన్న వారు చప్పట్లతో వారిని అభినందించారు.


ఆ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోకు వేలల్లో వ్యూస్, లైక్స్ వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ``వర్షా కాలంలో పాములు, కొండచిలువలతో చాలా జాగ్రత్తగా ఉండాలి``, ``ఇలా దాక్కున్న కొండచిలువల కంటే పాములే చాలా ప్రమాదకరం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: విధి వక్రించడమంటే ఇదే... వర్షంలో డ్యాన్స్ చేస్తూ వీడియో.. చివరకు ఏం జరిగిందో చూడండి..


Optical Illusion: మీవి డేగ కళ్లు అయితే.. ఈ ఫొటోలో దాక్కున్న రింగ్ ఎక్కడుందో కనుక్కోండి..


Viral Video: హాస్టల్‌లో ఉంటే ఇలాంటివి తప్పవు.. చపాతీతో నూడిల్స్ ఎలా తింటోందో చూడండి.. వీడియో వైరల్..


Viral: నేను పెళ్లి చేసుకుంటున్నా.. ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి వెళ్లిన మహిళా ఉద్యోగిపై ఫన్నీ ఫ్రాంక్..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 15 , 2024 | 11:41 AM