Viral Video: కుక్కర్‌ను ఇంత తెలివిగా ఎవరూ వాడలేరేమో.. ఈ విద్యార్థి తెలివితేటలు చూస్తే అవాక్కవ్వాల్సిందే..
ABN , Publish Date - Feb 28 , 2024 | 09:43 PM
సోషల్ మీడియాలో వంటకాలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. కొందరు వంట చేసే పద్ధతి వినూత్నంగా ఉంటుంది. మరికొందరు వంట చేసే పద్ధతి చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ విద్యార్థి కుక్కర్‌లో వంట చేసే పద్ధతి చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. కుక్కర్‌ను ఇలాక్కూడా వాడొచ్చా.. అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
వంట చేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కొందరు కొత్త కొత్త రెసిపీలతో సరికొత్త వంటకాలు చేస్తుంటే.. మరికొందరు రోజూ చేసే వంటలనే సరికొత్తగా చేస్తుంటారు. అయితే కొందరు మాత్రం ఇంకాస్త తెలివిగా ఆలోచించి మరీ వంటలు చేసేస్తుంటారు. ఇలాంటి ప్రయోగాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో (Viral video) ఒకటి నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంటాయి. ఓ విద్యార్థి కుక్కర్‌లో వంట చేసే విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘కుక్కర్‌ను ఇంత తెలివిగా ఎవరూ వాడలేరేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ విద్యార్థి వంట చేసేందుకు సిద్ధమయ్యాడు. అయితే అన్నం, కూరలు చేయాలంటే చాలా సమయం పడుతుందనే ఉద్దేశంతో కాస్త తెలివిగా ఆలోచించాడు. అన్నీ విడివిడిగా చేసే కంటే.. అన్నింటినీ ఒకేసారి చేయాలని నిర్ణయించుకున్నాడు. ఓ చిన్న పాత్రలో బియ్యం, నీరు పోసి పక్కన పెట్టుకున్నాడు. తర్వాత కుక్కర్‌లో (cooker) పప్పు కోసం పోపు పెట్టాడు. కందిబేడలు తదితరాలను అందులో వేసి నీళ్లు పోస్తాడు. చివరగా వాటి మధ్యలో ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న బియ్యం (rice) పాత్రను ఉంచుతాడు.
Viral Video: పాత టీషర్ట్‌తో మ్యాజిక్.. టెంకాయలు తెంపడానికి ఇతడు వాడిన టెక్నిక్ చూస్తే..
అలాగే వాటి మధ్య ఓ బంగాళాదుంపను కూడా వేస్తాడు. ఫైనల్‌గా అన్నీ ఉడికిన తర్వాత బయటికి తీసి పెట్టుకుంటాడు. ఉడికిన బంగాళాదుంపును చిన్న చిన్న ముక్కలుగా చేసి, అందులో టామాటా, ఉల్లిపాయలు తదితరాలను కలిపి మరో కూరను తయారు చేస్తాడు. ఇలా అన్నం, పప్పు, బంగాళాదుంప కూరలతో వేడి వేడిగా భోజనం చేసేస్తాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘ఇది కదా తెలివి అంటే’’.. అంటూ కొందరు, ‘‘ఒక దెబ్బకు మూడు వంటకాలు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.