Share News

Exam: ఆన్సర్ షీట్‌లో జై శ్రీరామ్ నినాదాలు, క్రికెటర్ల పేర్లు.. పేపర్ దిద్దిన టీచర్ ఏం చేశాడో తెలిస్తే షాకవడం ఖాయం..!

ABN , Publish Date - Apr 27 , 2024 | 11:36 AM

బాగా చదువుకుని, చక్కగా పరీక్షలు రాస్తేనే ఎవరైనా పాస్ అవుతారు. చాలా మంది విద్యార్థులు అలాగే రాసి పాస్ అవుతుంటారు. కొందరు బద్ధకస్తులు మాత్రం తప్పుడు మార్గంలో పాస్ కావడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే టీచర్లు నిజాయితీగా వ్యవహరించి వారిని తగిన విధంగా శిక్షిస్తుంటారు. తాజాగా యూపీలో మాత్రం విచిత్రం జరిగింది.

Exam: ఆన్సర్ షీట్‌లో జై శ్రీరామ్ నినాదాలు, క్రికెటర్ల పేర్లు.. పేపర్ దిద్దిన టీచర్ ఏం చేశాడో తెలిస్తే షాకవడం ఖాయం..!
Jai Shri Ram slogans in Answer sheet

బాగా చదువుకుని, చక్కగా పరీక్షలు (Exams) రాస్తేనే ఎవరైనా పాస్ అవుతారు. చాలా మంది విద్యార్థులు (Students) అలాగే రాసి పాస్ అవుతుంటారు. కొందరు బద్ధకస్తులు మాత్రం తప్పుడు మార్గంలో పాస్ కావడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే టీచర్లు నిజాయితీగా వ్యవహరించి వారిని తగిన విధంగా శిక్షిస్తుంటారు. తాజాగా యూపీలో (Uttar pradesh) మాత్రం విచిత్రం జరిగింది. యూపీకి చెందిన ఓ యూనివర్సిటీలో (University) మొదటి సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులు జవాబు పత్రంలో ``జై శ్రీరామ్`` (Jai Shri Ram) నినాదాలు రాశారు. వారిని ప్రొఫెసర్లు (Professors) 60 శాతం మార్కులతో పాస్ చేశారు.


యూపీ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు ప్రొఫెసర్లు విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసి వారిని అక్రమ పద్ధతిలో పాస్ చేశారు. డబ్బులు కట్టిన విద్యార్థులు జవాబు పత్రాలో ``జై శ్రీరామ్`` నినాదాలు, క్రికెటర్ల పేర్లు రాసి పేపర్లు నింపారు. ఆ ఇద్దరు ప్రొఫెసర్లు వారిని పాస్ చేశారు. దీంతో ఆ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు దివ్యాంశు సింగ్ ఈ స్కామ్ గురించి ప్రధాన మంత్రికి, ముఖ్యమంత్రికి, గవర్నర్‌కు, వైస్-ఛాన్స్‌లర్‌కు లేఖ రాశారు. సున్నా మార్కుల విద్యార్థులను కూడా 60 శాతం మార్కులతో ప్రొఫెసర్లు పాస్ చేసినట్టు ఆరోపించాడు.


ఆ లేఖపై ఆర్టీఐ స్పందించి వారి జవాబు పత్రాలను రీ-వాల్యూయేషన్ చేయించింది. దీంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటనపై ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకుని పాస్ చేసినట్టు తేలింది. ఆయా ప్రొఫెసర్లను యూనివర్సిటీ యాజమాన్యం తొలగించింది. ఇలాంటివి మరోసారి పునరావృతం కానివ్వబోమని హామీ ఇచ్చింది. కాగా, ``జై శ్రీరామ్`` నినాదాలతో ఉన్న జవాబు పత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి..

Personality Test: మీ మొహం ఏ షేప్‌లో ఉంది?.. మీ మొహం ఆకృతిని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు..!


Puzzle: మీ కళ్లకు అసలైన పరీక్ష ఇది.. ఈ ఫొటోలోని ఐదు నక్షత్రాలు ఎక్కడున్నాయో కనిపెట్టండి!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 27 , 2024 | 11:36 AM