Share News

Viral Video: క్లాస్‌లో గొడవ జరుగుతోందని పరుగులు పెట్టిన టీచర్.. లోపలికి వెళ్లాక ఏం జరిగిందో చూస్తే..

ABN , Publish Date - Sep 20 , 2024 | 08:41 AM

ఆమె ఓ పాఠశాలలో టీచర్.. కొన్ని రోజుల క్రితం ఆమె స్కూలులో ఉండగా క్లాస్‌రూమ్ నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వచ్చాయి.. క్లాస్‌లో పిల్లలు కొట్టుకుంటున్నారని ఎవరో చెప్పడంతో ఆ టీచర్ పరుగులు పెట్టారు.. పరిగెత్తుకుంటూ క్లాస్‌రూమ్‌లోకి వెళ్లారు..

Viral Video: క్లాస్‌లో గొడవ జరుగుతోందని పరుగులు పెట్టిన టీచర్.. లోపలికి వెళ్లాక ఏం జరిగిందో చూస్తే..
Teacher

ఆమె ఓ పాఠశాలలో టీచర్ (Teacher).. కొన్ని రోజుల క్రితం ఆమె స్కూలులో ఉండగా క్లాస్‌రూమ్ నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వచ్చాయి.. క్లాస్‌లో పిల్లలు (Students) కొట్టుకుంటున్నారని ఎవరో చెప్పడంతో ఆ టీచర్ పరుగులు పెట్టారు.. పరిగెత్తుకుంటూ క్లాస్‌రూమ్‌లోకి వెళ్లారు.. అయితే అప్పటి వరకు గొడవ పడిన విద్యార్థులు ఒక్కసారిగా ఆ టీచర్‌పై పూలు జల్లి సర్‌ప్రైజ్ చేశారు.. టీచర్స్ డే (Teachers day) సందర్భంగా మహారాష్ట్రలోని స్కూల్ విద్యార్థులు తమ టీచర్‌కు ఇలా సర్‌ప్రైజింగ్‌గా విషెస్ చెప్పారు. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది (Viral Video).


మహారాష్ట్రలోని కరాడ్‌లోని జయవంత్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు తమ టీచర్‌కు ఇలా సర్‌ప్రైజింగ్‌గా టీచర్స్ డే విషెస్ చెప్పారు. sargam_princesofficial అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. కొంతమంది విద్యార్థులు టీచర్ దగ్గరకు వెళ్లి క్లాస్‌లో గొడవ జరగుతోందని చెప్పారు. ఇది విన్న టీచర్ వెంటనే క్లాస్ వైపు పరుగెత్తారు. ఆమె క్లాస్‌లోకి ఎంటర్ కాగానే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. పిల్లలు ఆమెను చుట్టుముట్టి బొకే అందించారు. చప్పట్లతో అభినందించారు.


పిల్లలు చేసిన పనికి ముందు ఆశ్చర్యపోయిన టీచర్ తర్వాత సంతోషంతో నవ్వుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు 5.4 కోట్ల మందికి పైగా వీక్షించారు. 52 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ``ఆమె ఎంత వేగంగా పరుగులు పెట్టిందో చూడండి``, ``ఆ గౌరవానికి ఆమె అర్హురాలు``, ``ఇది నిజమైన సర్‌ప్రైజింగ్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఈ కుర్రాడి ప్రతిభ చూస్తే నివ్వెరపోవాల్సిందే.. 25 కోట్ల మంది ఈ వీడియోను ఎందుకు చూశారంటే..


Viral: నా అందమే నా పాలిట శ్రతువుగా మారింది.. ఆవేదన వెళ్లగక్కిన హాట్ మోడల్..


Viral Video: ట్రాక్టర్ పట్టుకెళ్లేందుకు వచ్చిన లోన్ రికవరీ ఏజెంట్లు.. వాళ్లను బెదిరించడానికి యువతి ఏం చేసిందంటే..


Viral: ఇదెక్కడి రూల్ నాయనా? బెంగళూరులోని ఆ మాల్‌లో రెస్ట్‌రూమ్‌ వాడుకోవాలంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 20 , 2024 | 08:41 AM