Share News

Viral Video: నడిరోడ్డుపై లో దుస్తులతో వాకింగ్.. రీల్ కోసం ఓ యువతి పిచ్చి పని.. వార్నింగ్ రావడంతో..

ABN , Publish Date - Sep 27 , 2024 | 03:08 PM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చాలా మంది పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. సభ్యత, సంస్కారం మర్చిపోతున్నారు. ఎలాగైనా సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించాలని తాపత్రయపడుతున్నారు. ముఖ్యంగా యువతి అసభ్యంగా ప్రవర్తిస్తూ ఇతరులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు

Viral Video: నడిరోడ్డుపై లో దుస్తులతో వాకింగ్.. రీల్ కోసం ఓ యువతి పిచ్చి పని.. వార్నింగ్ రావడంతో..
Girl made a reel wearing obscene clothes

సోషల్ మీడియా (Social Media) అందుబాటులోకి వచ్చాక చాలా మంది పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. సభ్యత, సంస్కారం మర్చిపోతున్నారు. ఎలాగైనా సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించాలని తాపత్రయపడుతున్నారు. ముఖ్యంగా యువతి అసభ్యంగా ప్రవర్తిస్తూ ఇతరులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఓ అమ్మాయి ఇండోర్‌ (Indore)లో రద్దీ రోడ్డుపై లో దుస్తులు (obscene clothes) మాత్రమే ధరించి షో చేసింది. తన ఫీట్‌ను వీడియో తీయించుకుని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వైరల్ వీడియోపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి (Viral Video).


@manoj23695 అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌‌కు చెందిన ఓ యువతి డెనిమ్ షార్ట్, బేర్ బ్రా ధరించి రద్దీగా ఉండే రోడ్డులో వాహనాల మధ్య నడుచుకుంటూ వెళ్లింది. అమ్మాయిని ఆ స్థితిలో చూసి వాహనదారులు, రోడ్డుపై ఉన్న వారు ఆశ్చర్యపోయారు. ఆ యువతి తను చేసిన ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియో విపరీతంగా వైరల్ అయింది. బహిరంగ ప్రదేశాల్లో ఆమె ఇలా ప్రవర్తించినందుకు నెటిజన్లు ఆమెపై విరుచుకుపడ్డారు. అలాగే ఆమెను వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని భజ్‌రంగ్ దళ్ డిమాండ్ చేసింది.


తీవ్ర విమర్శలు వ్యక్తం కావడంతో ఆ యువతి వెనక్కి తగ్గింది. తాను చేసిన తప్పేంటో గ్రహించింది. క్షమాపణలు కోరుతూ ఓ వీడియోను విడుదల చేసింది. ``క్షమించండి. నేను తప్పు చేశాను. పబ్లిక్ ప్లేస్‌లో అలాంటి బట్టలు వేసుకుని తిరగకూడదు. నా ప్రవర్తన మీ మనోభావాలను దెబ్బతీస్తే క్షమించండి. ఇకపై ఇలాంటి తప్పులు చేయను`` అంటూ పేర్కొంది.


ఇవి కూాడా చదవండి..

Viral Video: వామ్మో.. చీమ కూడా ఇంతలా భయపెడుతుందా? జర్మన్ ఫొటోగ్రాఫర్ తీసిన ఫొటో చూస్తే షాకవ్వాల్సిందే..


Viral Video: 5 రూపాయలతో 50 కిలోమీటర్లు.. బీహార్ కుర్రాడు తయారు చేసిన ఈ వెరైటీ బైక్ స్పెషాలిటీ ఏంటంటే..


Viral Video: తెలివంటే ఇదీ.. బైక్ ఇంజిన్, ఫ్యాన్‌తో వినూత్న వాహనం.. గాల్లోకి ఎగిరే చౌకైన విహంగం..


Viral Video: వావ్.. హిప్పోలు కూడా ఇంత బుద్ధిగా ఉంటాయా? పళ్లు తోముతుంటే హిప్పో ఏం చేసిందో చూడండి..


Viral News: 11 సంవత్సరాల తర్వాత ఇంటికొచ్చాడు.. అసలేం జరిగిందో తెలిస్తే షాకవ్వాల్సిందే..


Picture Puzzle: మీరు పజిల్ స్పెషలిస్టులా?.. ఈ వర్డ్ పజిల్‌లోని ``IRON``ను 8 సెకెన్లలో కనుక్కోండి...


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Sep 27 , 2024 | 03:08 PM