Share News

Viral Video: కింగ్ కోబ్రాకు షాంపుతో స్నానం.. చివరకు దాని నిర్వాకం చూస్తే.. షాకే..

ABN , Publish Date - Jun 01 , 2024 | 08:51 PM

చిన్న చిన్న పాములు కనపడితేనే ఒళ్లంతా జలదరిస్తుంది. ఇక పెద్ద పెద్ద పాములను చూస్తే ప్రాణాలు పోయినంత పనవుతుంది. ఇక పొరపాటున అవి కాస్త దగ్గరగా వస్తే మాత్రం ఇక దాదాపు గుండె ఆగిపోయినట్లు అనిపిస్తుంటుంది. అయితే..

Viral Video: కింగ్ కోబ్రాకు షాంపుతో స్నానం.. చివరకు దాని నిర్వాకం చూస్తే.. షాకే..

చిన్న చిన్న పాములు కనపడితేనే ఒళ్లంతా జలదరిస్తుంది. ఇక పెద్ద పెద్ద పాములను చూస్తే ప్రాణాలు పోయినంత పనవుతుంది. ఇక పొరపాటున అవి కాస్త దగ్గరగా వస్తే మాత్రం ఇక దాదాపు గుండె ఆగిపోయినట్లు అనిపిస్తుంటుంది. అయితే కొందరు మాత్రం ప్రమాదకర పాములతో కూడా ఆటలు ఆడుకోవడం చూస్తుంటాం. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి కింగ్ కోబ్రాకు షాంపుతో స్నానం చేయించాడు. చివరకు ఏం జరిగిందో మీరూ చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పాములకు స్నానం చేయించే వారిని చాలా మందిని చూస్తూ ఉంటాం. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఓ వ్యక్తి ఏకంగా కింగ్ కోబ్రాకే స్నానం చేయించేందుకు సిద్దమయ్యాడు. స్నానం చేయించడం అంటే.. ఏదో ఆషామాషీగా కాకుండా మనుషుల మాదిరే షాంపుతో చేయించాడు. ముందుగా కింగ్ కోబ్రాపై నీళ్లు పోసి శుభ్రం చేస్తాడు.

Viral Video: స్కూటీపై వెళ్తూ యువకుల ముందు ఫోజ్ కొట్టిన యువతులు.. చివరకు..


ఆ తర్వాత షాంపు చేతిలోకి తీసుకుని, (man bathed the snake with shampoo) పాము మొత్తానికి మర్ధనా చేస్తాడు. ఆ తర్వాత పాముపై మళ్లీ నీళ్లు పోసి శుభ్రం చేస్తాడు. అయితే అతను ఇంత చేస్తున్నా కింగ్ కోబ్రా మాత్రం కనీసం పడగ కూడా ఎత్తకుండా సైలెంట్‌గా ఉండిపోతుంది. పైగా తనకు స్నానం అంటే ఇష్టం లేనట్లుగా చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తూ అతడి మెడ పైకి ఎక్కి పక్కకు పారిపోయేందుకు ప్రయత్నిస్తుంది.

Viral Video: బైకుపై స్విమ్మింగ్ పూల్.. ఎండ వేడి తట్టుకునేలా ఇతను చేసుకున్న ఏర్పాట్లు చూడండి..


అయినా అతను పామును బలవంతంగా పట్టుకుని స్నానం చేయిస్తాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఓరి నాయనో.. ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘వామ్మో.. చూస్తుంటేనే భయమేస్తోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 21వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఎవరూ లేని సమయంలో ఆఫీసులో యువతి నిర్వాకం.. సీసీ ఫుటేజీ పరిశీలించగా.. అవాక్కయ్యే సీన్..

Updated Date - Jun 01 , 2024 | 08:51 PM