అందరి దృష్టీ ఆ పోరుపైనే!
ABN , Publish Date - May 29 , 2024 | 06:30 AM
ఈసారి టీ20 వరల్డ్‌క్‌పలో అత్యధికంగా 20 జట్లు పాల్గొంటుండగా, వాటిని నాలుగు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో ఐదేసి జట్లు పోటీపడతాయి. ఇందులో గ్రూప్ ‘ఎ’ మాత్రం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఎందుకంటే...
మరో 4 రోజుల్లో టీ20 వరల్డ్‌కప్
ఆసక్తికరంగా గ్రూప్ ‘ఎ’
ఈసారి టీ20 వరల్డ్‌క్‌పలో అత్యధికంగా 20 జట్లు పాల్గొంటుండగా, వాటిని నాలుగు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో ఐదేసి జట్లు పోటీపడతాయి. ఇందులో గ్రూప్ ‘ఎ’ మాత్రం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఎందుకంటే.. టీమిండియాతో పాటు దాయాది పాకిస్థాన్ కూడా ఇందులోనే ఉంది. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే ప్రపంచ క్రికెట్ ప్రేమికులెంత ఆత్రుతగా ఎదురుచూస్తారనే విషయం తెలిసిందే. అలాగే అమెరికా, కెనడా, ఐర్లాండ్ ఈ గ్రూప్‌లో ఉన్న ఇతర జట్లు. ఈ నేపథ్యంలో జూన్ 2 నుంచి ఆరంభమయ్యే ఈ మెగా టోర్నీలోని గ్రూప్ ‘ఎ’ పరిస్థితిని ఓసారి పరిశీలిద్దాం..
భారత జట్టు షెడ్యూల్
జూన్ 5-భారత్ ్ఠ ఐర్లాండ్-రాత్రి 8 గం. (న్యూయార్క్)
జూన్ 9-భారత్ ్ఠ పాకిస్థాన్-రాత్రి 8 గం. (న్యూయార్క్)
జూన్ 12-భారత్ఠ్ అమెరికా-రాత్రి 8 గం. (న్యూయార్క్)
జూన్ 24-భారత్ఠ్ కెనడా-రాత్రి 8 గం. (ఫ్లోరిడా)
భారత్
2013 తర్వాత ఐసీసీ టోర్నీ లేని వెలితిని టీమిండియా పూరించాలనుకుంటోంది. దీనిలో భాగంగా రోహిత్ నేతృత్వంలో భారత్ తమ పటిష్ఠ జట్టును బరిలోకి దింపింది. అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్ల మేళవింపుతో చక్కటి సమతూకంతో కనిపిస్తోంది. ముఖ్యంగా రోహిత్, జైస్వాల్, విరాట్, సూర్యకుమార్‌లతో టాపార్డర్ బలంగానే ఉంది. వికెట్ కీపర్లు పంత్, శాంసన్ ఇటీవలి ఐపీఎల్‌లో తామేంటో నిరూపించుకున్నారు. ఇక ఆల్‌రౌండర్లు జడేజా, హార్దిక్, శివమ్ దూబే, అక్షర్‌లతో జట్టు చివరి వరకు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం కలిగి ఉంది. బుమ్రా పేస్ దళాన్ని నడిపించనుండగా.. చాహల్, కుల్దీప్ కీలక స్పిన్నర్లు. జూన్ 5న తమ ఆరంభ మ్యాచ్‌ను భారత జట్టు ఐర్లాండ్‌తో ఆడనుంది. 9న పాక్, 12న యూఎస్, 15న కెనడాతో మ్యాచ్‌లుంటాయి.
పాకిస్థాన్
ఇటీవలి టీ20 వరల్డ్‌క్‌పల్లో పాక్ జట్టు విశేషంగానే రాణించింది. 2021 టోర్నీలో సెమీస్, 2022లో ఫైనల్‌కు చేరగలిగింది. టైటిల్ వేటలో అతి సమీపం వరకు వచ్చినా విజేతగా నిలువలేకపోయిన వేళ.. ఈసారి మాత్రం బాబర్ ఆజమ్ సేన కప్‌ను వదలకూడదన్న కసితో ఉంది. అనుభవజ్ఞులు మహ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, షహీన్ షా అండగా ఉండనున్నారు. అలాగే యువ హిట్టర్ సయీమ్ అయూబ్ అరంగేట్రం చేయనున్నాడు. ఇక పీసీబీ విజ్ఞప్తిమేరకు పేసర్ మహ్మద్ ఆమిర్ ఈ టోర్నీ కోసం రిటైర్మెంట్‌ను వెనక్కితీసుకోవాల్సి వచ్చింది. అతడితో పాటు నసీమ్ షా, రౌఫ్.. స్పిన్నర్లు షాదాబ్, అబ్రార్, ఆల్‌రౌండర్ ఇమాద్ వసీం ఎలాంటి జట్టునైనా కట్టడి చేయగల సమర్థులే. జూన్ 6న యూఎ్‌సఏతో ఆరంభ మ్యాచ్ ఆడనుంది.
ఐర్లాండ్
ఈ జట్టుకు ఇప్పటికే పెద్ద జట్లను ఓడించిన అనుభవం ఉంది. టీ20 వరల్డ్‌క్‌పలో వరుసగా ఎనిమిదోసారి ప్రాతినిధ్యం వహిస్తుండడం వీరి నిలకడైన ఆటతీరుకు ఉదాహరణ. ఓపెనర్లు స్టిర్లింగ్, బల్బిర్నీలతో పాటు టెక్టర్, టకర్, అడెయిర్, కాంఫర్‌లతో మిడిలార్డర్ గట్టిగానే కనిపిస్తోంది. ఇక బౌలింగ్‌లో పేసర్ జోషువా లిటిల్ కీలకం కానున్నాడు.
సంచలనం కోసం.. అమెరికా, కెనడా
ఈ గ్రూప్‌లో మిగతా జట్లు యూఎ్‌సఏ, కెనడా సంచలన ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాయి. అటు తొలిసారి పాల్గొంటున్న ఆతిథ్య యూఎస్ ఈ ఫార్మాట్‌లో ఇప్పటికే కెనడాపై 4-0తో, బంగ్లాదేశ్‌పై 2-1తో సిరీ్‌సను దక్కించుకుంది. అలాగే స్వదేశీ అవకాశాన్ని సొమ్ము చేసుకుని చెలరేగాలనుకుంటోంది. కెప్టెన్ మోనంక్ పటేల్, స్టీవెన్ టేలర్, కివీస్ మాజీ ఆటగాడు కోరె అండర్సన్ కీలక బ్యాటర్లు. మరోవైపు నాలుగుసార్లు వన్డే వరల్డ్‌క్‌పలో ఆడిన కెనడా జట్టు.. టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనడం మాత్రం ఇదే తొలిసారి. ఈ టీమ్‌లో నలుగురు మినహా అంతా 30+ వయస్సు వారే. అలాగే 37 ఏళ్ల కెప్టెన్ సాద్ బిన్ జఫర్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఒక్క విజయమైనా సాధించాలనుకుంటోంది.
(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)