చెన్నై మళ్లీ..
ABN , Publish Date - Mar 31 , 2025 | 02:48 AM
ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన పోరులో రాజస్థాన్ రాయల్స్ పట్టు వదల్లేదు. నితీశ్ రాణా (36 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 81) అదిరే ఆటకు.. స్పిన్నర్ వనిందు హసరంగ (4/35) మ్యాజిక్ బంతులు...

వరుసగా రెండో ఓటమి
రాజస్థాన్ బోణీ
గువాహటి: ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన పోరులో రాజస్థాన్ రాయల్స్ పట్టు వదల్లేదు. నితీశ్ రాణా (36 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 81) అదిరే ఆటకు.. స్పిన్నర్ వనిందు హసరంగ (4/35) మ్యాజిక్ బంతులు తోడవ్వడంతో ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 6 పరుగుల తేడాతో గట్టెక్కింది. దీంతో ఆడిన మూడో మ్యాచ్‌లో రాజస్థాన్ బోణీ చేయగా.. చెన్నైకిది వరుసగా రెండో ఓటమి. ముందుగా రాజస్థాన్ 20 ఓవర్లలో 182/9 స్కోరు చేసింది. రియాన్ పరాగ్ (28 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 37) రాణించాడు. నూర్, పథిరన, ఖలీల్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో చెన్నై 20 ఓవర్లలో 176/6 స్కోరుకే పరిమితమైంది. ఫామ్‌లో ఉన్న రచిన్ డకౌట్ కాగా, కెప్టెన్ రుతురాజ్ (63) ఆదుకునే ప్రయత్నం చేశాడు. మరో ఓపెనర్ రాహుల్ త్రిపాఠి (23)తో కలిసి రుతురాజ్ రెండో వికెట్‌కు 46 రన్స్ జోడించాడు. శివమ్ దూబే (18), విజయ్ శంకర్ (9) విఫలంకాగా కీలక సమయంలో రుతురాజ్‌ను హసరంగ దెబ్బతీశాడు. ఈ దశలో జడేజా (32 నాటౌట్)-ధోనీ (16) గెలిపించే ప్రయత్నం చేశారు. అయితే ఆఖరి ఓవర్‌లో విజయానికి 20 రన్స్ అవసరమవగా.. తొలి బంతికే ధోనీ అవుటవడంతో చెన్నై ఆశలు వదులుకుంది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా రాణా నిలిచాడు.
నితీశ్ రాణాదే జోరు: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో వన్‌డౌన్ బ్యాటర్ నితీశ్ రాణా తుఫాన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు. పేస్, స్పిన్ ఏదైనా బంతి బౌండరీ ఆవలే అన్నట్టుగా అతడి ఆటతీరు సాగింది. తను క్రీజులో ఉన్నంతసేపు 200 స్కోరు కూడా సులువే అనిపించింది. అయితే సరైన సమయంలో పుంజుకున్న చెన్నై బౌలర్లు డెత్ ఓవర్లలో కట్టడి చేశారు. కెప్టెన్ పరాగ్ సైతం వేగంగా ఆడే ప్రయత్నం చేయగా మిగతా బ్యాటర్లు పెద్దగా సహకరించలేదు. తొలి ఓవర్‌లోనే ఓపెనర్ జైస్వాల్ (4)ను పేసర్ ఖలీల్ అవుట్ చేశాడు. ఆ తర్వాత శాంసన్ (20)తో కలిసి రాణా రెండో వికెట్‌కు 42 బంతుల్లోనే 82 రన్స్ జత చేశాడు. ఒవర్టన్‌ను లక్ష్యంగా చేసుకుని నాలుగో ఓవర్‌లో 4,4,6తో 16 రన్స్ రాబట్టాడు. తర్వాతి ఓవర్‌లోనే అశ్విన్‌ను బాదేస్తూ వరుసగా 6,6,4తో అదుర్స్ అనిపించాడు. ఇక ఖలీల్ ఓవర్‌లో 4,4,6 సాధించడంతో పవర్‌ప్లేలో జట్టు స్కోరు 79/1తో నిలిచింది. రాణా కూడా 21 బంతుల్లోనే ఫిఫ్టీని పూర్తి చేశాడు. అయితే చెన్నై తరుపుముక్క స్పిన్నర్ నూర్ తన తొలి ఓవర్‌లోనే శాంసన్‌ను అవుట్ చేసి రిలీఫ్‌నిచ్చాడు. ఆర్‌ఆర్ స్కోరు 11వ ఓవర్‌లోనే వంద దాటింది. మరోవైపు రాణా అశ్విన్ ఓవర్‌లో వరుసగా 6,4 బాది వెంటనే అవుటవడంతో మూడో వికెట్‌కు పరాగ్‌తో 38 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత సీఎస్‌కే బౌలర్లు ఆధిపత్యం చూపి వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ పరుగులను కట్టడి చేశారు. పరాగ్ ఉన్న కాసేపు బ్యాట్ ఝుళిపించినా పథిరన యార్కర్‌కు బౌల్డ్ కాగా, హెట్‌మయెర్ (19) భారీ షాట్లు ఆడలేకపోయాడు.
స్కోరుబోర్డు
రాజస్థాన్: జైస్వాల్ (సి) అశ్విన్ (బి) ఖలీల్ 4, శాంసన్ (సి) రచిన్ (బి) నూర్ 20, నితీశ్ రాణా (స్టంప్డ్) ధోనీ (బి) అశ్విన్ 81, పరాగ్ (బి) పథిరన 37, జురెల్ (సి) పథిరన (బి) నూర్ 3, హసరంగ (సి) శంకర్ (బి) జడేజా 4, హెట్‌మయెర్ (సి) అశ్విన్ (బి) పథిరన 19, ఆర్చర్ (సి) రుతురాజ్ (బి) ఖలీల్ 0, కార్తికేయ (రనౌట్) 1, తీక్షణ (నాటౌట్) 2, తుషార్ (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 20 ఓవర్లలో 182/9; వికెట్ల పతనం: 1-4, 2-86, 3-124, 4-134, 5-140, 6-166, 7-174, 8-175, 9-176; బౌలింగ్: ఖలీల్ 4-0-38-2, ఒవర్టన్ 2-0-30-0, అశ్విన్ 4-0-46-1, నూర్ అహ్మద్ 4-0-28-2, పథిరన 4-0-28-2, జడేజా 2-0-10-1.
చెన్నై: రచిన్ (సి) జురెల్ (బి) ఆర్చర్ 0, రాహుల్ త్రిపాఠి (సి) హెట్‌మయెర్ (బి) హసరంగ 23, రుతురాజ్ (సి) జైస్వాల్ (బి) హసరంగ 63, శివమ్ దూబే (సి) పరాగ్ (బి) హసరంగ 18, విజయ్ శంకర్ (బి) హసరంగ 9, జడేజా (నాటౌట్) 32, ధోనీ (సి) హెట్‌మయెర్ (బి) సందీప్ 16, ఒవర్టన్ (నాటౌట్) 11, ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 20 ఓవర్లలో 176/6; వికెట్ల పతనం: 1-0, 2-46, 3-72, 4-92, 5-129, 6-164; బౌలింగ్: ఆర్చర్ 3-1-13-1, తుషార్ 4-0-45-0, సందీప్ 4-0-42-1, తీక్షణ 4-0-30-0, హసరంగ 4-0-35-4, కార్తికేయ 1-0-10-0.
ఇవి కూడా చదవండి..
IPL 2025, CSK vs RR: ట్రెండ్ మార్చిన చెన్నై.. ఆ ఇద్దరినీ జట్టు నుంచి తప్పించారుగా
IPL 2025: దుమ్మురేపుతున్న జియో హాట్‌స్టార్.. రికార్డులు బద్దలుగొడుతున్న వ్యూయర్‌షిప్
IPL 2025, CSK vs RR: చెన్నై సూపర్ కింగ్స్ vs రాజస్తాన్ రాయల్స్.. ఈ ఇద్దరిలో పైచేయి ఎవరిది
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..