Share News

వణికించిన స్టార్క్‌ రైజర్స్‌ బేజార్‌!

ABN , Publish Date - Mar 31 , 2025 | 02:58 AM

రెండో సొంత మైదానం వైజాగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ అద్భుతంగా ఆడింది. తొలి మ్యాచ్‌లో ఓటమి అంచులనుంచి విజయం అందుకొని భళా అనిపించిన ఢిల్లీ, అదే జోరులో..అరవీర భయంకర బ్యాటింగ్‌ లైన్‌పతో...

వణికించిన స్టార్క్‌ రైజర్స్‌ బేజార్‌!

ఐపీఎల్‌లో నేడు

వేదిక ముంబై రా.7.30

ముంబై X కోల్‌కతా

ఈసారి అలవోకగా మూడు వందల పరుగులు చేసే జట్టుగా క్రికెట్‌ పండితుల అంచనాల మధ్య ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ భీకరంగా ఆడింది..కానీ తర్వాత లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌, తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌ సన్‌‘రైజింగ్‌’ను అడ్డుకున్నాయి..ఆరంభ మ్యాచ్‌లో హద్దులు లేకుండా చెలరేగిన హైదరాబాద్‌ బ్యాటర్లకు లఖ్‌నవూ, ఢిల్లీ బౌలర్లు ముకుతాడు వేశారు..దాంతో రెండు వరుస పరాజయాలతో హైదరాబాద్‌ బ్యాటింగ్‌ డొల్లతనం బయటపడింది.

  • డుప్లెసి మెరుపు హాఫ్‌ సెంచరీ

  • ఏడు వికెట్లతో ఢిల్లీ ఘన విజయం

విశాఖపట్నం: రెండో సొంత మైదానం వైజాగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ అద్భుతంగా ఆడింది. తొలి మ్యాచ్‌లో ఓటమి అంచులనుంచి విజయం అందుకొని భళా అనిపించిన ఢిల్లీ, అదే జోరులో..అరవీర భయంకర బ్యాటింగ్‌ లైన్‌పతో ప్రత్యర్థి జట్ల గుండెల్లో గుబులు రేపుతున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను నేలకు దించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్లతో హైదరాబాద్‌ను చిత్తు చేసింది. వరుసగా రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో క్యాపిటల్స్‌ రెండో స్థానానికి దూసుకొచ్చింది. తొలుత సన్‌రైజర్స్‌ 18.4 ఓవర్లలో 163 పరుగులకే కుప్పకూలింది. అనికేత్‌ వర్మ (41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 74) హాఫ్‌ సెంచరీతో చెలరేగగా, క్లాసెన్‌ (32), హెడ్‌ (22) రాణించారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ స్టార్క్‌ (5/35) టీ20 కెరీర్‌లో అత్యుత్తమ బౌలింగ్‌తో హైదరాబాద్‌ వెన్ను విరిచాడు. స్వల్ప ఛేదనను ఢిల్లీ 16 ఓవర్లలో 166/3 స్కోరుతో ముగించింది. డుప్లెసి (27 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50) మెరుపు అర్థ శతకం చేయగా, మెక్‌గర్క్‌ (38), అభిషేక్‌ పోరెల్‌ (34 నాటౌట్‌) సత్తా చాటారు. లెగ్గీ జీషన్‌ అన్సారీ (3/42) మూడు వికెట్లు తీశాడు.


అనికేత్‌ తప్ప అంతా ఫ్లాప్‌..: క్రీజులో అడుగుపెట్టిందే తడవుగా భారీ షాట్లతో విరుచుకు పడాలనే ఆలోచన హైదరాబాద్‌ కొంపముంచింది. అదేసమయంలో..బ్యాటింగ్‌ అనుకూలించిన పిచ్‌పై తెలివిగా ఆడిన అనికేత్‌ వర్మ..ఢిల్లీ బౌలర్ల భరతం పట్టాడు. అనికేత్‌ పుణ్యాన సన్‌రైజర్స్‌కు ఆ స్కోరైనా సాధ్యమైంది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌ను పేసర్‌ స్టార్క్‌ వణికించాడు. లేని సింగిల్‌ కోసం అభిషేక్‌ను పిలిచిన హెడ్‌ అతడి రనౌట్‌కు కారణమవడంతో మొదటి ఓవర్లోనే హైదరాబాద్‌ వికెట్‌ చేజార్చుకుంది. ఇక.. తన రెండో ఓవర్లో ఇషాన్‌ కిషన్‌ (2), నితీశ్‌ (0)లను పెవిలియన్‌ చేర్చిన స్టార్క్‌ సన్‌రైజర్స్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. కొద్దిసేపటికే హెడ్‌ను కూడా స్టార్క్‌ క్యాచవుట్‌ చేయడంతో పవర్‌ ప్లేలో హైదరాబాద్‌ 58/4తో తీవ్ర ఇక్కట్లలో పడింది. ఈ దశలో అనికేత్‌, క్లాసెన్‌ ఐదో వికెట్‌కు 42 బంతుల్లో 77 పరుగులు జోడించి పరిస్థితి చక్కదిద్దారు. ముఖ్యంగా ఢిల్లీ స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకున్న అనికేత్‌ భారీ షాట్లతో అలరించాడు. క్లాసెన్‌ దూకుడుకు మోహిత్‌ చెక్‌ పెట్టగా, అభినవ్‌ (4), కమిన్స్‌ (2)లను పెవిలియన్‌ చేర్చిన కుల్దీప్‌ ఆపై అనికేత్‌నూ అవుట్‌ చేశాడు.


ఢిల్లీ అలవోకగా..: స్వల్ప లక్ష్యాన్ని ఢిల్లీ ఆడుతు..పాడుతు ఛేదించింది. ఓపెనర్లు డుప్లెసి, మెక్‌గర్క్‌ ఆరంభం నుంచే హైదరాబాద్‌ బౌలర్లపై ఎదురు దాడికి దిగారు. తొలి వికెట్‌కు 55 బంతుల్లోనే 81 పరుగులు జత చేశారు. స్పిన్నర్‌ జీషన్‌ ఒకే ఓవర్లో డుప్లెసి, మెక్‌గర్క్‌ను ఆపై కేఎల్‌ రాహుల్‌ (15)ను అవుట్‌ చేశాడు. కానీ స్టబ్స్‌ (21 నాటౌట్‌) జతగా అభిషేక్‌ పోరెల్‌ జట్టును విజయ తీరాలకు చేర్చాడు.

స్కోరుబోర్డు

సన్‌రైజర్స్‌: అభిషేక్‌ (రనౌట్‌) 1, హెడ్‌ (సి) రాహుల్‌ (బి) స్టార్క్‌ 22, ఇషాన్‌ (సి) స్టబ్స్‌ (బి) స్టార్క్‌ 2, నితీశ్‌ (సి) అక్షర్‌ (బి) స్టార్క్‌ 0, అనికేత్‌ (సి) మెక్‌గర్క్‌ (బి) కుల్దీప్‌ 74, క్లాసెన్‌ (సి) నిగమ్‌ (బి) మోహిత్‌ 32, అభినవ్‌ (సి) డుప్లెసి (బి) కుల్దీప్‌ 4, కమిన్స్‌ (సి) మెక్‌గర్క్‌ (బి) కుల్దీప్‌ 2, ముల్డర్‌ (సి) డుప్లెసి (బి) స్టార్క్‌ 9, హర్షల్‌ (సి) అక్షర్‌ (బి) స్టార్క్‌ 5, షమి (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 18.4 ఓవర్లలో 163 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-11, 2-20, 3-25, 4-37, 5-114, 6-119, 7-123, 8-148, 9-162, 10-163; బౌలింగ్‌: స్టార్క్‌ 3.4-0-35-5, ముకేశ్‌ 2-0-17-0, అక్షర్‌ పటేల్‌ 4-0-43-0, విప్రాజ్‌ నిగమ్‌ 2-0-21-0, మోహిత్‌ 3-0-25-1, కుల్దీప్‌ 4-0-22-3.


ఢిల్లీ: ఫ్రేజర్‌ మెక్‌గర్క్‌ (సి అండ్‌ బి) జీషన్‌ 38, డుప్లెసి (సి) ముల్డర్‌ (బి) జీషన్‌ 50, అభిషేక్‌ పోరెల్‌ (నాటౌట్‌) 34, కేఎల్‌ రాహుల్‌ (బి) జీషన్‌ 15, స్టబ్స్‌ (నాటౌట్‌) 21, ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 16 ఓవర్లలో 166/3; వికెట్ల పతనం: 1-81, 2-96, 3-115; బౌలింగ్‌: షమి 3-0-31-0, అభిషేక్‌ శర్మ 3-0-27-0, కమిన్స్‌ 2-0-27-0, హర్షల్‌ 3-0-17-0, జీషన్‌ అన్సారీ 4-0-42-3, ముల్డర్‌ 1-0-16-0.

1

టీ20ల్లో ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం స్టార్క్‌కు ఇదే తొలిసారి.

పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

బెంగళూరు 2 2 0 0 4 2.266

ఢిల్లీ 2 2 0 0 4 1.320

లఖ్‌నవూ 2 1 1 0 2 0.963

గుజరాత్‌ 2 1 1 0 2 0.625

పంజాబ్‌ 1 1 0 0 2 0.550

కోల్‌కతా 2 1 1 0 2 -0.308

చెన్నై 3 1 2 0 2 -0.771

హైదరాబాద్‌ 3 1 2 0 2 -0.871

రాజస్థాన్‌ 3 1 2 0 2 -1.112

ముంబై 2 0 2 0 0 -1.163

గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;

ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్‌ రన్‌రేట్‌

ఇవి కూడా చదవండి..

IPL 2025, CSK vs RR: ట్రెండ్ మార్చిన చెన్నై.. ఆ ఇద్దరినీ జట్టు నుంచి తప్పించారుగా

IPL 2025: దుమ్మురేపుతున్న జియో హాట్‌స్టార్.. రికార్డులు బద్దలుగొడుతున్న వ్యూయర్‌షిప్

IPL 2025, CSK vs RR: చెన్నై సూపర్ కింగ్స్ vs రాజస్తాన్ రాయల్స్.. ఈ ఇద్దరిలో పైచేయి ఎవరిది

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 31 , 2025 | 02:58 AM