Share News

Virat Kohli: చేతిలో కత్తితో సీరియస్‌గా కోహ్లీ.. అంత కోపం ఎవరి మీదంటే..

ABN , Publish Date - Nov 28 , 2024 | 03:21 PM

Virat Kohli: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఏం చేసినా సెన్సేషన్ అయిపోతుంది. అతడికి ఉన్న మాస్ ఫాలోయింగ్ అలాంటిది. తాజాగా అతడు చేసిన ఓ పని వైరల్ అవుతోంది.

Virat Kohli: చేతిలో కత్తితో సీరియస్‌గా కోహ్లీ.. అంత కోపం ఎవరి మీదంటే..

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఏది చేసినా సెన్సేషన్ అయిపోతుంది. అతడికి ఉన్న మాస్ ఫాలోయింగ్ అలాంటిది. ప్రస్తుత క్రికెట్‌లో కింగ్‌కు ఉన్నంత ఫ్యాన్‌బేస్ మరో ప్లేయర్‌కు లేదనే చెప్పాలి. భారత్‌లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా భారీ అభిమాన గణం కోహ్లీ సొంతం. అతడు కదిలితే ఓ వార్త అయిపోతుంది. దాని గురించి సోషల్ మీడియాలో హంగామా నడుస్తూ ఉంటుంది. కోహ్లీ ఏం చేస్తున్నాడు? ఎక్కడ ఉన్నాడు? అనేది తెలుసుకోవడానికి ఫ్యాన్స్ చూపించే ఇంట్రెస్టే దీనికి కారణం. తాజాగా అతడు చేసిన ఓ పని వైరల్ అవుతోంది. కత్తులు కటార్లతో కోహ్లీ సిద్ధమవడం చర్చనీయాంశంగా మారింది.


వార్నింగ్ వారికే..

పెర్త్ టెస్ట్‌లో సెంచరీతో చెలరేగాడు కోహ్లీ. తిరిగి ఫామ్‌ను అందుకున్న ఈ టాప్ బ్యాటర్.. ఆ మ్యాచ్‌లో కంగారూ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్.. ఇప్పుడు అడిలైడ్ ఆతిథ్యం ఇవ్వనున్న రెండో టెస్ట్‌కు రెడీ అవుతున్నాడు. అందుకోసం నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చుతున్నాడు. ఫామ్‌ను కొనసాగించి మరోమారు ఆసీస్ బౌలర్లకు నరకం చూపించాలని అనుకుంటున్నాడు. ఇదే క్రమంలో తాను అడిలైడ్ వార్‌కు సిద్ధమనే సిగ్నల్స్ ఇస్తూ ఓ ఫన్నీ వీడియో పోస్ట్ చేశాడు. ఇందులో చేతిలో పలు ఆయుధాలు పట్టుకొని కనిపించాడు.


బ్యాగ్‌లో నుంచి ఒక్కొక్కటిగా..

ఆయుధాల బ్యాగ్ బయటకు తీసిన కోహ్లీ అందులో నుంచి ఒక్కో వెపన్ తీసి చూపించాడు. మొదట గొడ్డలి లాంటి ఓ ఆయుధాన్ని బయటకు తీసిన విరాట్.. ఆ తర్వాత తీగతో చుట్టిన బేస్‌బాల్ బ్యాట్‌ను చేతితో పట్టుకొని కనిపించాడు. అనంతరం కొన్ని కత్తుల్ని పట్టుకొని సీరియస్‌గా ఫోజులు ఇచ్చాడు. ఇది ఒక యాడ్ కోసం తీసిన వీడియోగా తెలుస్తోంది. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దీన్ని చూసిన నెటిజన్స్ మాత్రం.. ఇది కంగారూ టీమ్‌కు వార్నింగ్ ఇచ్చేందుకు చేసినదిగా చెబుతున్నారు. కత్తులు కటార్లతో ఆయుధ పూజ చేసిన కోహ్లీ.. తాను మరో యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరికలు పంపుతున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. ఆసీస్‌కు మళ్లీ దబిడిదిబిడేనని చెబుతున్నారు.


Also Read:

ఆర్సీబీపై భగ్గుమంటున్న కన్నడ ఫ్యాన్స్

ఆస్ట్రేలియా ప్రధానితో టీమిండియా.. కోహ్లీతో ఏం మాట్లాడారు..

షమీకి బీసీసీఐ డెడ్‌లైన్.. ఆ రెండు కఠిన పరీక్షలు దాటితేనే..

For More Sports And Telugu News

Updated Date - Nov 28 , 2024 | 03:54 PM