Share News

LSG vs SRH: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్స్

ABN , Publish Date - May 08 , 2024 | 07:27 PM

ఐపీఎల్-2024లో భాగంగా ఈరోజు (బుధవారం) లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ జట్లు తలపడుతున్నాయి. ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో లక్నో జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. ఈ సీజన్‌లో ఇరుజట్లు..

LSG vs SRH: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్స్

ఐపీఎల్-2024లో భాగంగా ఈరోజు (బుధవారం) లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ జట్లు తలపడుతున్నాయి. ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో లక్నో జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. ఈ సీజన్‌లో ఇరుజట్లు తలపడటం ఇదే తొలిసారి. ఇప్పటివరకూ ఐపీఎల్‌లో ఈ రెండు జట్లు మూడుసార్లు తలపడగా.. ఆ మూడింటిలోనూ లక్నో జట్టు గెలుపొందింది. అయితే.. ఈసారి హైదరాబాద్ జట్టు పటిష్టంగా ఉంది కాబట్టి, అందుకు ప్రతీకారం తీర్చుకోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు.. ఈ మ్యాచ్ సొంత మైదానంలోనే జరగుతోంది కాబట్టి, ఇది కలిసొచ్చే అంశమే!

ఈ సీజన్‌లో ఇప్పటిదాకా చెరో 11 మ్యాచ్‌లు ఆడిన లక్నో, హైదరాబాద్ జట్లు.. ఆరేసి విజయాలను సాధించాయి. అయితే.. రన్‌రేట్ మెరుగ్గా ఉండటంతో హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉండగా, లక్నో ఆరో స్థానంలో ఉంది. దీంతో.. ఈ మ్యాచ్ లక్నోకి ఎంతో కీలకంగా మారింది. ఒకవేళ అది ఓడిపోతే.. రన్‌రేట్ తేడా కొట్టి, ప్లేఆఫ్స్ రేసులో స్థానం పొందేందుకు కష్టతరం అవుతుంది. అందుకే.. ఈ మ్యాచ్ ఎలాగైనా గెలుపొందాలని లక్నో భావిస్తోంది. మరోవైపు.. హైదరాబాద్‌కి కూడా ఇంకా మూడు మ్యాచ్‌లు ఉన్నాయి. వాటిలో రెండు గెలిచినా.. ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం. అయితే.. గత మూడు పరాజయాలకు మాత్రం ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటోంది.


తుది జట్లు

హైదరాబాద్: ట్రావిస్ హెడ్, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, షాబాజ్‌ అహ్మద్‌, సన్వీర్‌ సింగ్, పాట్ కమిన్స్‌ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్‌, జయ్‌దేవ్ ఉనద్కత్, విజయ్‌కాంత్ వియస్కాంత్, నటరాజన్‌.

లక్నో: క్వింటన్ డాకాక్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), మార్కస్ స్టాయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్‌ బదోని, దీపక్ హుడా, కృనాల్ పాండ్య, కృష్ణప్ప గౌతమ్, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్‌, నవీనుల్ హక్.

Updated Date - May 08 , 2024 | 07:27 PM