Share News

Nitish Kumar Reddy: తండ్రినే కాదు.. మొత్తం స్టేడియాన్ని ఏడిపించాడు.. నితీష్‌కు సెల్యూట్

ABN , Publish Date - Dec 28 , 2024 | 05:49 PM

Boxing Day Test: మెల్‌బోర్న్ టెస్ట్‌లో అద్భుతం చేసి చూపించాడు తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి. థండర్ ఇన్నింగ్స్‌తో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు. సూపర్ సెంచరీతో కంగారూల వెన్నులో వణుకు పుట్టించాడు.

Nitish Kumar Reddy: తండ్రినే కాదు.. మొత్తం స్టేడియాన్ని ఏడిపించాడు.. నితీష్‌కు సెల్యూట్
Nitish Kumar Reddy

IND vs AUS: ఆస్ట్రేలియా వర్సెస్ తెలుగోడు. ఇది నెవర్ ఎండింగ్ రైవల్రీ అనే చెప్పాలి. వీవీఎస్ లక్ష్మణ్ జమానాలో మొదలైన ఈ వార్ ఇప్పుడు పీక్స్‌కు చేరుకుంది. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ లాంటి తోపులను ఔట్ చేసినా.. లక్ష్మణ్‌ను మాత్రం ఆపలేకపోయేది ఆసీస్. ఎన్నోమార్లు ఆ జట్టుకు పీడకల ఎలా ఉంటుందో చూపించాడు వీవీఎస్. స్పెషల్ ఇన్నింగ్స్‌లతో వాళ్లకు నిద్రలేని రాత్రులు పరిచయడం చేశాడు. ఇప్పుడా వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి. బీజీటీ-2024లో ఒక్కో మ్యాచ్‌లో ఒక్కో స్టన్నింగ్ నాక్‌తో ఆతిథ్య జట్టుకు చుక్కలు చూపిస్తున్నాడు. తాజాగా మెల్‌బోర్న్ టెస్ట్‌లో వండర్‌ఫుల్ సెంచరీతో మెరిశాడు.


ఒక్కటైన స్టేడియం

బాక్సింగ్ డే టెస్ట్‌లో సూపర్ సెంచరీతో మెరిశాడు నితీష్ రెడ్డి. ఓటమి ఖాయం అనుకున్న తరుణంలో దేవుడిలా వచ్చి టీమ్‌ను ఆదుకున్నాడు. 8వ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగి టీమ్‌ను కాపాడాడు. వాషింగ్టన్ సుందర్‌తో కలసి జట్టును ఒడ్డున పడేశాడు. వాళ్లిద్దరూ ఎనిమిదో వికెట్‌కు 127 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించారు. ఈ క్రమంలో నితీష్ మూడంకెల మార్క్‌ను అందుకున్నాడు. అతడు సెంచరీని రీచ్ అవ్వగానే స్టేడియం మొత్తం దద్దరిల్లింది. భారత్, ఆసీస్ అనే తేడాల్లేకుండా ఇరు జట్ల అభిమానులు చప్పట్లు, ఈలలతో రచ్చ రచ్చ చేశారు. నితీష్.. నితీష్ అని గట్టిగా అరుస్తూ అతడ్ని ఎంకరేజ్ చేశారు. నితీష్ తండ్రి సంతోషాన్ని తట్టుకోలేక ఏడ్చేశాడు.


ఏడ్చేసిన రవిశాస్త్రి

నితీష్ తండ్రి కన్నీళ్లను చూసి మిగతా ఆడియెన్స్ కూడా ఏడ్చేశారు. అభిమానులే కాదు.. కామెంట్రీ బాక్స్‌లో వ్యాఖ్యానం చేస్తున్న టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కూడా ఎమోషనల్ అయ్యాడు. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో గొప్ప ఇన్నింగ్స్‌ల్లో ఇదొకటిగా ఎప్పటికీ నిలిచి పోతుందని అన్నాడు. నితీష్.. సూపర్బ్ బ్యాటింగ్ అంటూ ఆనందం తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరో కామెంటేటర్, మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సీట్‌లో నుంచి లేచి మరీ చప్పట్లు కొట్టాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజాలు ఫెయిలైన చోట.. కాకలుదీరిన స్టార్క్, కమిన్స్ లాంటి తోపు బౌలర్లను తట్టుకొని నితీష్ ఆడిన తీరు, సెంచరీని అందుకున్న విధానం చూసి చాలా మంది ఫ్యాన్స్ ఎమోషనల్ అయ్యారు.


Also Read:

నితీష్ రెడ్డిపై సీఎం చంద్రబాబు ప్రశంసలు..

కన్నీళ్లు ఆపుకోలేకపోయిన నితీష్ రెడ్డి తల్లి.. కొడుకు బ్యాటింగ్

అదరగొట్టిన నితీష్ కుమార్ రెడ్డి.. పుష్ప స్టైల్లో సంబరాలు

For More Sports And Telugu News

Updated Date - Dec 28 , 2024 | 05:55 PM