Nitish Kumar Reddy: నా ఆట నాకే నచ్చట్లేదు.. నితీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Dec 29 , 2024 | 07:31 PM
IND vs AUS: టీమిండియా నయా సెన్సేషన్ నితీష్ కుమార్ రెడ్డి గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. ఒక్క ఇన్నింగ్స్‌తో నేషన్ వైడ్ స్టార్‌గా మారిన ఈ తెలుగు తేజం బ్యాటింగ్ మీద అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
IND vs AUS: టీమిండియా నయా సెన్సేషన్ నితీష్ కుమార్ రెడ్డి గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. ఒక్క ఇన్నింగ్స్‌తో నేషన్ వైడ్ స్టార్‌గా మారిన ఈ తెలుగు తేజం బ్యాటింగ్ మీద అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. డెబ్యూ సిరీస్‌లో ఆస్ట్రేలియా లాంటి పటిష్టమైన జట్టు మీద వాళ్ల సొంతగడ్డపై ఈ రేంజ్‌లో చెలరేగి ఆడటం సూపర్ అని మెచ్చుకుంటున్నారు. పేస్‌కు అనుకూలమైన కండీషన్స్‌లో మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, బోలాండ్ లాంటి తోపు బౌలర్లను తట్టుకొని అతడు ఆడిన తీరు, భారత్‌ను ఓటమి నుంచి బయటపడేసిన విధానం హైలైట్ అంటూ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. అయితే తన ఆటను అందరూ ప్రశంసిస్తున్నా నితీష్ రెడ్డి మాత్రం హ్యాపీగా లేడు. కారణం ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
అదే నా టార్గెట్
బ్యాటింగ్ విషయంలో హ్యాపీగా ఉన్నానని.. కానీ తన బౌలింగ్ తనకే నచ్చలేదని అంటున్నాడు నితీష్. టీమిండియా తరఫున మంచి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకోవాలనేది తన డ్రీమ్ అని అన్నాడు. బ్యాటింగ్ విషయంలో సంతృప్తితో ఉన్నా బౌలింగ్‌లో మాత్రం అంచనాలను అందుకోలేకపోయానని అన్నాడు. బౌలింగ్‌ను మెరుగుపర్చుకోవడంపై మరింత ఫోకస్ చేస్తానని మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో నితీష్ పేర్కొన్నాడు. భారత జట్టులో ఖాళీగా ఉన్న పేస్ ఆల్‌రౌండర్ కోటాను భర్తీ చేయడమే తన ధ్యేయమని అతడు స్పష్టం చేశాడు. అందుకోసం ఎంత పరిశ్రమించేందుకైనా తాను సిద్ధమని వ్యాఖ్యానించాడు.
అతడే రోల్ మోడల్
విరాట్ కోహ్లీ తన ఫేవరెట్ క్రికెటర్ అని చెప్పిన నితీష్.. అతడితో కలసి డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడం అంతా కలలా ఉందన్నాడు. అతడు తన రోల్ మోడల్ అన్నాడు. కోహ్లీని చిన్నప్పటి నుంచి ఆరాధిస్తున్నానని.. మొత్తానికి అతడితో కలసి ఆడుతున్నానని తెలిపాడు. ఈ క్షణాల కోసం ఎన్నాళ్లుగానో కలలు కంటూ వచ్చానని.. ఎట్టకేలకు అవి నిజమయ్యాయంటూ హర్షం వ్యక్తం చేశాడు. ప్రస్తుత ఆసీస్ జట్టులో బోలాండ్ కఠినమైన బౌలర్ అన్నాడు తెలుగోడు. అతడు నిలకడగా ఒకే లైన్ అండ్ లెంగ్త్‌లో బంతులు వేస్తూ సవాల్ విసురుతుంటాడని చెప్పుకొచ్చాడు.
Also Read:
జడేజాకు క్లాస్ పీకిన రోహిత్.. పిచ్చి పట్టిందా అంటూ..
ఎక్కడి నుంచి వచ్చామనేది కాదు.. నితీష్‌పై పవన్ రియాక్షన్
నితీష్ రెడ్డికి అరుదైన గౌరవం.. సచిన్ సరసన తెలుగోడు..
బుమ్రా పగబడితే ఇట్లుంటది.. బెయిల్స్ వెతకడానికి టైమ్ సరిపోదు..
For More Sports And Telugu News