Share News

త్వరలో రిటైర్మెంట్‌పై నిర్ణయం : సైనా నెహ్వాల్‌

ABN , Publish Date - Sep 03 , 2024 | 05:22 AM

కొన్నాళ్లుగా ఆటకు దూరమైన భారత వెటరన్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ ఈ ఏడాది చివర్లో రిటైర్మెంట్‌పై నిర్ణయం తీసుకుంటానని వెల్లడించింది. కీళ్ల నొప్పుల కారణంగా గతంలో మాదిరి

త్వరలో రిటైర్మెంట్‌పై నిర్ణయం : సైనా నెహ్వాల్‌

న్యూఢిల్లీ: కొన్నాళ్లుగా ఆటకు దూరమైన భారత వెటరన్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ ఈ ఏడాది చివర్లో రిటైర్మెంట్‌పై నిర్ణయం తీసుకుంటానని వెల్లడించింది. కీళ్ల నొప్పుల కారణంగా గతంలో మాదిరి ఎక్కువ గంటలు సాధన చేయలేకపోతున్నానని తెలిపింది. ‘నాకు కీళ్ల నొప్పులు మొదలయ్యాయి. రోజుకు 8-9 గంటలు సాధన చేయడం కష్టంగా తయారైంది. ఈ స్థితిలో ప్రపంచ మేటి షట్లర్లతో ఎలా తలపడగలను? త్వరలో రిటైర్మెంట్‌పై నిర్ణయం తీసుకుంటా’ అని సైనా తెలిపింది.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - Sep 03 , 2024 | 05:22 AM

News Hub