IPL 2024 Final: చెలరేగుతున్న బ్యాటర్లు.. విజయం దిశగా కోల్‌కతా!
ABN , Publish Date - May 26 , 2024 | 10:02 PM
చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరుగుతున్న ఫైనల్ (IPL 2024) మ్యాచ్ చప్పగా సాగుతోంది (SRH VS KKR). పరుగులు చేయడానికి హైదరాబాద్ బ్యాటర్లు ఇబ్బంది పడిన పిచ్‌పై కోల్‌కతా బ్యాటర్లు పరుగుల వరద పారిస్తున్నారు.

చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరుగుతున్న ఫైనల్ (IPL 2024) మ్యాచ్ చప్పగా సాగుతోంది (SRH VS KKR). పరుగులు చేయడానికి హైదరాబాద్ బ్యాటర్లు ఇబ్బంది పడిన పిచ్‌పై కోల్‌కతా బ్యాటర్లు పరుగుల వరద పారిస్తున్నారు. పవర్ ప్లే ముగిసే సమయానికి కోల్‌కతా ఒక వికెట్ కోల్పోయి 72 పరుగులు చేసింది.
కోల్‌కతా ఓపెనర్ సునీల్ నరైన్ (6) కమిన్స్ ఓవర్లో అవుటయ్యాడు. అయితే మరో ఓపెనర్ గుర్భాజ్ (21), వెంకటేష్ అయ్యర్ (40) మాత్రం బౌండరీలతో విరుచుకుపడ్డారు. దీంతో కోల్‌కతా విజయం దిశగా సాగుతోంది. కాగా, టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటైంది. కోల్‌కతాకు ఇంకా 84బంతుల్లో 42 పరుగులు కావాల్సి ఉంది. క్రీజులో గుర్భాజ్, వెంకటేష్ అయ్యర్ ఉన్నారు.