Share News

Manu Bhaker: హ్యాట్రిక్ మిస్.. త్రుటిలో మూడో పతకాన్ని చేజార్చుకున్న మను బాకర్.. నాలుగో స్థానంతో సరి..!

ABN , Publish Date - Aug 03 , 2024 | 03:57 PM

పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించి జోరు మీదున్న షూటర్ మను బాకర్ మూడో పతక వేటలో గురి తప్పింది. త్రుటిలో మూడో పతకాన్ని కోల్పోయి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఒక్క ఒలింపిక్స్‌లో మూడు పతకాలు సాధించే అవకాశాన్ని కోల్పోయింది.

Manu Bhaker: హ్యాట్రిక్ మిస్.. త్రుటిలో మూడో పతకాన్ని చేజార్చుకున్న మను బాకర్.. నాలుగో స్థానంతో సరి..!
Manu Bhaker

పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించి జోరు మీదున్న షూటర్ మను బాకర్ (Manu Bhaker) మూడో పతక వేటలో గురి తప్పింది. త్రుటిలో మూడో పతకాన్ని కోల్పోయి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఒక్క ఒలింపిక్స్‌లో మూడు పతకాలు సాధించే అవకాశాన్ని కోల్పోయింది. 25 మీ. పిస్టల్ (25m pistol) విభాగంలో మను బాకర్ గురి తప్పింది. దీంతో నాలుగో స్థానంలో నిలిచింది. ఇంతకు ముందు 10 మీ. పిస్టల్ వ్యక్తిగత, మిక్స్‌డ్ డబులు విభాగాల్లో మను బాకర్ కాంస్య పతకాలు సాధించిన సంగతి తెలిసిందే (Paris Olympics 2024).


25 మీ. పిస్టల్ విభాగం ఫైనల్ స్టేజ్ వన్‌లో మను బాకర్ మెరుగైన ప్రదర్శన చేయలేకపోయింది. కేవలం రెండు షాట్లు మాత్రమే కొట్టింది. అయితే ఆ తర్వాత పుంజుకుంది. సిరీస్ 2 నుంచి సిరీస్ 6 వరకు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ఏకంగా రెండో స్థానం వరకు వెళ్లింది. అయితే ప్రత్యర్థి షూటర్లు కూడా మెరుగైన ప్రదర్శన చేశారు. దీంతో ఎలిమినేషన్ చివరి సిరీస్‌ 8లో ఒత్తిడికి గురైన మను కేవలం రెండు షాట్లు మాత్రమే కొట్టింది. దీంతో రేసులో మను వెనుకబడింది.


హంగేరీకి చెందిన షూటర్ వెరొనికా 3 షాట్లు కొట్టి మూడో స్థానానికి చేరుకుంది. దీంతో మను నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 25 మీ. పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కొరియాకు చెందిన క్రీడాకారిణి యాంగ్ జిన్ స్వర్ణం గెలుచుకుంది. ఫ్రాన్స్ షూటర్ కామెలీకి రజతం దక్కింది. వెరొనికా మూడో స్థానంలో నిలిచి కాంస్యం పతకాన్ని చేజిక్కంచుకుంది.

ఇవి కూడా చదవండి..

Gambhir, Kohli's Joy: నవ్వులు... అంతలోనే మాడిన మొహలు


MS Dhoni-Joginder Sharma: మహేంద్రుడితో జోగేంద్రుడి ఫొటో, వైరల్


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 03 , 2024 | 03:57 PM