ఓటమి దిశగా శ్రీలంక
ABN , Publish Date - Nov 30 , 2024 | 12:33 AM
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక ఓటమి దిశగా పయనిస్తోంది. 516 పరుగుల భారీ ఛేదన కోసం బరిలోకి దిగిన ఈ జట్టు మూడో రోజు శుక్రవారం రెండో ఇన్నింగ్స్‌లో 103 పరుగులకు
రెండో ఇన్నింగ్స్ 103/5
డర్బన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక ఓటమి దిశగా పయనిస్తోంది. 516 పరుగుల భారీ ఛేదన కోసం బరిలోకి దిగిన ఈ జట్టు మూడో రోజు శుక్రవారం రెండో ఇన్నింగ్స్‌లో 103 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. క్రీజులో చాందిమల్ (29 బ్యాటింగ్), ధనంజయ పరుగులేమీ చేయకుండా ఉన్నారు. జాన్సెన్, రబాడలకు రెండేసి వికెట్లు దక్కాయి. శ్రీలంక గెలవాలంటే ఇంకా 413 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందు సఫారీ రెండో ఇన్నింగ్స్‌లో స్టబ్స్ (122), బవు మా (113) సెంచరీలు సాధించారు. దీంతో ఆతిథ్య జట్టు 366/5 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో లంక 45, దక్షిణాఫ్రికా 191 పరుగులు చేశాయి.