India vs England: రాజ్‌కోట్ టెస్టులో నయా చరిత్ర లిఖించిన టీమిండియా.. బద్ధలైన రికార్డులు ఇవే
ABN , Publish Date - Feb 18 , 2024 | 05:56 PM
టీమిండియా నయా చరిత్ర సృష్టించింది. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్ జట్టుని మట్టికరిపించింది. ఏకంగా 434 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించిన భారత్ చారిత్రాత్మకమైన విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయం ద్వారా టీమిండియా పలు రికార్డులను బద్ధలు కొట్టింది. ఆ రికార్డులు ఏమిటో మీరూ ఓ లుక్కేయండి.

అతిథ్య భారత్‌కు టెస్టుల్లో ఇదే అతిపెద్ద విజయంగా ఉంది. 434 పరుగుల తేడాతో సాధించిన ఈ విజయం చరిత్రలో నిలిచిపోనుంది. న్యూజిలాండ్‌పై 372 పరుగుల విజయం, దక్షిణాఫ్రికాపై 337 పరుగుల తేడాతో గెలుపు, న్యూజిలాండ్‌పై 321 పరుగులు, ఆస్ట్రేలియాపై 320 పరుగుల తేడాతో సాధించిన వరుసగా అతిపెద్ద విజయాల జాబితాలో ఉన్నాయి.
ఇక పర్యాటక జట్టు ఇంగ్లండ్‌కు టెస్టుల్లో అతిపెద్ద ఓటమి ఇదే. ప్రస్తుతం 434 పరుగుల తేడాతో ఓడిపోగా అంతకుముందు 1934లో ఆస్ట్రేలియాపై ఏకంగా 562 పరుగుల తేడాతో ఘార ఓటమిని చవిచూసింది. ఇక ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వరుసగా రెండు టెస్టుల్లో ఓటమిని చవిచూడడం ఇది రెండవసారి. అంతకుముందు 2003లో ఆస్ట్రేలియాపై వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ వరుస మ్యాచుల్లో ఓటమి పాలైంది.
కాగా రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ అద్భుతంగా రాణించింది. భారత్ నిర్దేశించిన 557 పరుగుల భారీ లక్ష్య చేధనలో ఇంగ్లండ్ జట్టు కేవలం 122 పరుగులకే కుప్పకూలింది. 33 పరుగులు చేసిన మార్క్ ఉడ్ టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా రెండవ ఇన్నింగ్స్‌లోనూ మెరిశాడు. 5 కీలకమైన వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించాడు. దీంతో జడేజాకి ‘ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.