Share News

Viral Video: స్టేజిపై స్పీచ్ ఇస్తూ .. చెప్పడానికి మాటలు రావటం లేదు..

ABN , Publish Date - Apr 06 , 2025 | 12:16 PM

Maharashtra Farewell Party: వర్ష షిండే కాలేజీలో చదువుతోంది. తాజాగా, కాలేజీలో ఫేర్‌వెల్ ఫంక్షన్ జరిగింది. ఇందులో భాగంగా వర్ష స్టేజిమీదకు ఎక్కి స్పీచ్ ఇవ్వసాగింది. కొద్దిసేపటి తర్వాత ఉన్నట్టుండి కిందపడి చనిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: స్టేజిపై స్పీచ్ ఇస్తూ .. చెప్పడానికి మాటలు రావటం లేదు..
Maharashtra Farewell Party

చావు, పుట్టుకలు అన్నవి మన చేతుల్లో లేని విషయాలు. ఎప్పుడు పుడతామో.. ఎప్పుడు చనిపోతామో ఎవ్వరికీ తెలీదు. అప్పటి వరకు ఎంతో సంతోషంతో ఆడిపాడి తిరిగిన వారు కూడా ఉన్నట్టుండి ప్రాణాలు కోల్పోవచ్చు. ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా యుక్త వయస్కులు.. ఆఖరికి చిన్న పిల్లలు కూడా ఉన్నట్టుండి చనిపోతున్నారు. వాటికి సంబంధించిన వీడియోలు సైతం బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఓ కాలేజ్ ఫేర్‌వెల్ ఫంక్షన్‌లో విషాదం చోటుచేసుకుంది. స్టేజిపై స్పీచ్ ఇస్తున్న ఓ యువతి ఉన్నట్టుండి కుప్పకూలింది. అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని దారాశివ్‌లో తాజాగా చోటుచేసుకుంది.


సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర దారాశివ్‌కు చెందిన వర్ష కరత్ అనే యువతి పరండలోని ఆర్జే సిండే కాలేజ్‌లో చదువుతోంది. తాజాగా, కాలేజీలో ఫేర్‌వెల్ పార్టీ జరిగింది. పార్టీ సందర్భంగా వర్ష స్టేజిపైకి ఎక్కి స్పీచ్ ఇవ్వసాగింది. ఆ స్పీచు వింటూ కింద ఉన్న స్నేహితులు ఆమెను ఆటపట్టించసాగారు.. నవ్వసాగారు. వర్షకూడా వారితో పాటు నవ్వి స్పీచ్ కొనసాగించింది. కొద్దిసేపటి తర్వాత ఉన్నట్టుండి కుప్పకూలి పోయింది. వెంటనే ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. వర్ష కుటుంబసభ్యులు చెబుతున్న దాని ప్రకారం..


ఆమెకు 8 ఏళ్ల వయసు ఉన్నపుడు గుండె ఆపరేషన్ జరిగింది. గత 12 సంవత్సరాల నుంచి ఆమెకు ఎలాంటి ఆరోగ్య సమస్య రాలేదు. దీంతో ఆమె గుండె సంబంధిత మందులు కూడా తీసుకోవటం మానేసింది. స్పీచు ఇస్తుండగా హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయింది. కాలేజీ యాజమాన్యం వర్ష మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఓ రోజు కాలేజీకి సెలవు ప్రకటించింది. ప్రస్తుతం సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. వర్ష మరణంపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులోనే గుండె పోటుతో చనిపోవటం బాధాకరం అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

టైమ్‌ మిషన్‌లో వెనక్కి...

చిన్న పిల్లలని కూడా చూడకుండా చెట్టుకు కట్టేసి..

Updated Date - Apr 06 , 2025 | 12:16 PM