Share News

‘అప్పుడే..నవతరం నాయకులు’

ABN , Publish Date - Dec 31 , 2024 | 06:09 AM

బాక్సింగ్‌ డే టెస్ట్‌లో సీనియర్లు మరోసారి విఫలమైన వేళ మాజీ ఆటగాడు అశ్విన్‌ చేసిన పోస్టులు కలకలం రేపుతోంది. రెండో ఇన్నింగ్స్‌ ఛేదనలో భారత్‌ మూడు వికెట్లు కోల్పోయిన సమయంలో అశ్విన్‌ తన ‘ఎక్స్‌’లో.....

‘అప్పుడే..నవతరం నాయకులు’

అశ్విన్‌ పోస్టుల మర్మమేంటో?

న్యూఢిల్లీ: బాక్సింగ్‌ డే టెస్ట్‌లో సీనియర్లు మరోసారి విఫలమైన వేళ మాజీ ఆటగాడు అశ్విన్‌ చేసిన పోస్టులు కలకలం రేపుతోంది. రెండో ఇన్నింగ్స్‌ ఛేదనలో భారత్‌ మూడు వికెట్లు కోల్పోయిన సమయంలో అశ్విన్‌ తన ‘ఎక్స్‌’లో.. ‘చెత్తకు పరిష్కారం చూపినప్పుడే నవతరం నాయకులు ఉద్భవిస్తారు’ అని చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. రోహిత్‌ను ఉద్దేశించే అతడు ఇలా కామెంట్‌ చేశాడని కొందరు ఫ్యాన్స్‌ మండిపడ్డారు. దీంతో ‘అభిమాన గణం ఉన్న వారిని ఉద్దేశించి కాదు’ అని సెటైరికల్‌గా అశ్విన్‌ మరో పోస్ట్‌ చేశాడు. దీనికి తోడు నవ్వుతూ ఉన్న ఎమోజీలను జోడించాడు. అశ్విన్‌ పోస్టును బట్టి డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆరోగ్యకరమైన వాతావరణం లేదనే సంగతి తెలుస్తోందని కొందరు నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

Updated Date - Dec 31 , 2024 | 06:09 AM