Ishan Kishan: ఇషాన్ కిషన్ మళ్లీ జట్టులోకి రావడానికి మార్గాలున్నాయా? అలా చేస్తేనే ఇక ఛాన్స్..!
ABN , Publish Date - Jul 19 , 2024 | 10:02 AM
గతేడాది దేశవాళీ క్రికెట్ జట్టుకు దూరంగా ఉన్నారనే కారణంతో యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్లను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి బీసీసీఐ తొలగించింది. అయితే తాజాగా శ్రీలంక టూర్ కోసం సెలక్టర్లు ప్రకటించిన జట్టులో శ్రేయస్ చోటు దక్కించుకున్నాడు.
గతేడాది దేశవాళీ క్రికెట్ జట్టుకు దూరంగా ఉన్నారనే కారణంతో యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్ (Ishan Kishan), శ్రేయాస్ అయ్యర్లను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి బీసీసీఐ తొలగించింది. అయితే తాజాగా శ్రీలంక టూర్ కోసం సెలక్టర్లు ప్రకటించిన వన్డే జట్టులో శ్రేయస్ (Shreyas Iyer) చోటు దక్కించుకున్నాడు. ఆటోమేటిక్‌గా బీసీసీఐ (BCCI) సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా పొందుతాడు. గంభీర్ మెంటార్‌గా ఉన్న కేకేఆర్ జట్టు కెప్టెన్ అయిన శ్రేయాస్ అయ్యర్, గంభీర్ (Gautam Gambhir) టీమిండియా హెడ్ కోచ్ కాగానే చాలా సులభంగానే జట్టులోకి పునరాగమనం చేశాడు.
శ్రేయాస్‌తో పాటు వేటుకు గురైన యువ ఆటగాడు ఇషాన్ కిషన్‌కు మాత్రం పునరాగమనం అంత సులభంగా జరిగేలా లేదు. తాజాగా శ్రీలంక వన్డే, టీ20 సిరీస్‌లకు కూడా ఇషాన్‌ను సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. ఇషాన్ కిషన్‌ను సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోవాలంటే అతడు కచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందే అనే వాదన వినిపిస్తోంది. గతేడాది జరిగిన విజయ్ హాజారే ట్రోఫీలో ఏడు మ్యాచ్‌ల్లో ఏడు హాఫ్ సెంచరీలు చేసిన యువ ఆటగాడు రియాన్ పరాగ్ తాజాగా శ్రీలంక టూర్‌కు ఎంపికయ్యాడు. దేశవాళీ క్రికెట్ ప్రదర్శనలకు జాతీయ సెలక్షన్ కమిటీ పూర్తి ప్రాధాన్యత ఇస్తుందని తాజాగా జరిగిన సమావేశంలో బీసీసీఐ స్పష్టత ఇచ్చింది.
కాగా, తాజాగా సెలక్టర్లు ఎంపిక చేసిన జట్టులో పలువురు యువ ప్రతిభావంతులకు చోటు దక్కకపోవడం కాస్త విస్మయం కలిగిస్తోంది. వన్డే టీమ్‌లోకి సంజూ శాంసన్‌ను తీసుకోలేదు. అలాగే ఇటీవల జింబాబ్వే టూర్‌లో సెంచరీ చేసిన అభిషేక్ శర్మ, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌లకు ఏ జట్టులోనూ చోటు దక్కలేదు.
ఇవి కూడా చదవండి..
Womens Asia Cup T20: నేటి నుంచే ఆసియా కప్ టీ20 పోరు.. పాకిస్థాన్, ఇండియా మధ్య తగ్గపోరు మ్యాచ్
Cricket: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. వైరల్ అవుతున్న గంభీర్ నాలుగేళ్ల క్రితం ట్వీట్..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..