కోర్టు ఆదేశాల ప్రకారం జైలులో వసతుల్లేవు!
ABN , Publish Date - Mar 29 , 2024 | 05:49 AM
ఢిల్లీ మద్యం కేసులో తిహాడ్ జైలులో ఉన్న కవితను భర్త అనిల్ కలిశారు. గురువారం ఉదయం 8 నుంచి 8.20 గంటల వరకు ములాఖత్‌లో భాగంగా కవితతో ఆయన

ములాఖత్‌లో భర్త అనిల్ దృష్టికి తీసుకొచ్చిన కవిత
మంగళసూత్రం, మందులు, కళ్లజోడు, పుస్తకాలను అనుమతించాలని న్యాయవాది ద్వారా కోర్టుకు వినతి
న్యూఢిల్లీ, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కేసులో తిహాడ్ జైలులో ఉన్న కవితను భర్త అనిల్ కలిశారు. గురువారం ఉదయం 8 నుంచి 8.20 గంటల వరకు ములాఖత్‌లో భాగంగా కవితతో ఆయన మాట్లాడినట్టు తెలిసింది. జైలులో వసతులు, భోజనం తదితర విషయాలపై ఆరా తీసినట్టు సమాచారం. ‘‘చిన్న కుమారుడు ఆర్య 11వ తరగతి పరీక్షలు ఎలా రాస్తున్నాడు? అమ్మ బాగానే ఉందని ఆర్యతో చెప్పండి’’ అని అనిల్‌తో ఆమె చెప్పినట్లు తెలిసింది. కాగా, కోర్టు ఆదేశాల ప్రకారం జైలులో ఎలాంటి వసతులు, సౌకర్యాలు కల్పించడం లేదని ఆమె అనిల్ దృష్టికి తీసుకొచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ విషయమై కవిత తరఫున న్యాయవాది... రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించినట్టు తెలిసింది. కవితకు జైలులో మంగళసూత్రం, కళ్లజోడు, పుస్తకాలు, మందులు అనుమతించాలని విజ్ఞప్తి చేసినట్టు సమాచారం.