Share News

TDP: తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం..

ABN , Publish Date - Mar 30 , 2025 | 11:48 AM

తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకరానున్నామని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు అన్నారు. తెలంగాణలో టీడీనీకి చెక్కుచెదరని కేడర్ ఉందన్నారు. రాష్టం విడిపోయిన తరువాత పార్టీ కొంచెం తగ్గినా మళ్లీ పూర్వ వైభవం వస్తుందన్నారు.

TDP: తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం..

- పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పొలిట్‌ బ్యూరో సభ్యుడు నర్సింహులు

హైదరాబాద్: తెలంగాణలో టీడీపీ(TDP)కి పూర్వ వైభవం తీసుకరానున్నామని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు చెప్పారు. హస్తినాపురం డివిజన్‌లోని రోషన్‌దౌలా బస్తీలో శనివారం ఎల్బీనగర్‌ టీడీపీ హడ్‌హక్‌ కమిటీ మెంబర్‌ వై.వెంకట్‌గాంధీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు హాజరై ఎన్‌టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ వార్తను కూడా చదవండి: Metro train: ఏప్రిల్‌ 1 నుంచి రాత్రి 11.45 వరకు మెట్రో రైళ్లు..


అనంతరం కేక్‌ కట్‌ చేసి ప్రజలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా బక్కని నర్సింహులు మాట్లాడుతూ తెలంగాణలో టీడీపీకి లీడర్‌, క్యాడర్‌ ఉన్నారన్నారు. వెంకటగాంధీ మాట్లాడుతూ టీడీపీకి ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో భలమైన నాయకులు, కార్యకర్తలు ఉన్నారని, రాబో యే రోజుల్లో ఎల్బీనగర్‌లో టీడీపీ జెండా ఎగరనున్నదని అన్నారు. టీడీపీ మల్కాజిగిరి పార్లమెంట్‌ కన్వీనర్‌ కందికంటి అశోక్‌కుమార్‌, నాయకులు పెంటయ్య, సురేష్ నాయుడు, ప్రసాద్‌బాబాయ్‌, సురేష్‌ పాల్గొన్నారు.

city6.jpg


బడుగు, బలహీన వర్గాల పార్టీ టీడీపీ : వెంకట్‌గాంధీ

వనస్థలిపురం : బడుగు, బలహీన వర్గాలను కేవలం ఓటు బ్యాంకు కోసమే వాడుకుంటున్న తరుణంలో వారికి రాజకీయ అవకాశాలను కూడా కల్పించాలన్న సంకల్పంతో ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఎల్బీనగర్‌ టీడీపీ హడ్‌హక్‌ కమిటీ సభ్యుడు వై.వెంకట్‌గాంధీ పేర్కొన్నారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వనస్థలిపురం డివిజన్‌ పరిధిలోని ఎన్‌టీఆర్‌ చౌరస్తా వద్ద వనస్థలిపురం కంటెస్టెడ్‌ కార్పొరేటర్‌ వెలగ చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో శనివారం ఎన్‌టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి టీడీపీ జెండాను ఆవిష్కరించారు. వై.వెంకట్‌గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు సురేష్ నాయుడు, ప్రసాద్‌ బాబాయ్‌, సురేష్‌, కృష్ణవేణిరెడ్డి, మురళీధర్‌రెడ్డి, మరాటి భిక్షపతి, మల్లేష్‌యాదవ్‌, ఫణి, ప్రవీణ్‌, మహేష్‌, కరణ్‌చౌదరి పాల్గొన్నారు.


హయత్‌నగర్‌ : టీడీపీ ఆవిర్భావ దినోత్సవాలను హయత్‌నగర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్కాజిగిరి టీడీపీ పార్లమెంటు కమిటీ సభ్యుడు సింగిరెడ్డి మురళీధర్‌రెడ్డి టీడీపీ జెండాను ఎగురవేశారు. అనంతరం ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో టీడీపీ హయత్‌నగర్‌ డివిజన్‌ అధ్యక్షుడు మరాటి భిక్షపతి, మన్సూరాబాద్‌ డివిజన్‌ అధ్యక్షుడు దుర్గం మల్లే్‌షయాదవ్‌, సీనియర్‌ నాయకులు శ్రీనివా్‌సగౌడ్‌, సత్యనారాయణగౌడ్‌, ప్రవీణ్‌, మహేందర్‌, కరణ్‌చౌదరి, సుధాకర్‌గౌడ్‌, రమే్‌షగౌడ్‌, శివానాయక్‌, రాజునాయక్‌ పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

40 ఏళ్లుగా మసిలే జలధారలు!

టెన్త్‌ జవాబు పత్రాల తరలింపులో నిర్లక్ష్యం

జములమ్మకు గద్వాల సంస్థానాధీశుల వారసుడి పూజలు

కిలాడీ లేడీ అరెస్టు.. బయటపడ్డ ఘోరాలు..

Read Latest Telangana News and National News

Updated Date - Mar 30 , 2025 | 11:48 AM